మహేష్ సినిమా...మొదలెట్టేశారు...

  • IndiaGlitz, [Wednesday,March 08 2017]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ సినిమా అంటే ఎంతో క్రేజ్‌, భారీ అంచ‌నాలు నెల‌కొని ఉంటాయి. అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే సినిమా యూనిట్ వియ‌త్నాం వెళుతుంది. ఈ సినిమా టైటిల్ విష‌యంలో ఇంకా సందిగ్ధ‌త వీడ‌లేదు. ముందు సినిమాకు సంభ‌వామి అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేసినా రీసెంట్‌గా ఈ సినిమాకు మ‌ర్మం అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.
అయితే ఇప్పుడు అభిమ‌న్యు అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌య్యేంత వ‌ర‌కు ఈ రూమ‌ర్స్‌కు తిరుగుండ‌ద‌నే విష‌యంలో సందేహం లేదు. ఈ సినిమాను జూన్ 23న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్స్ జ‌రుగుతున్నాయి. మ‌హేష్ ఇందులో స్పై క్యారెక్ట‌ర్ చేస్తున్నాడు. ర‌కుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.సూర్య విల‌న్ పాత్ర చేస్తున్నాడు.

More News

డోర ఆడియో విడుదల

ప్రముఖ కథానాయిక నయనతార తమిళ, తెలుగులో నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం డోర. తెలుగు, తమిళ భాషల్లో ఒకే పేరుతో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు.

ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో మరో హిట్ కొట్టడం ఆనందంగా ఉంది - రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందిన చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`.

పరభాష లోనూ రాజ్ వేశాలు!

యంగ్ హీరో రాజ్ తరుణ్ పట్టిందల్లా బంగారమే. రీసెంట్ గా`కిట్టు గాడు ఉన్నాడు జాగ్రత్త` అంటూ మరో భారీ సక్సెస్ ను యంగ్ హీరో సొంతం చేసుకున్నాడు.

ఉమెన్స్ డే ని పురస్కరించుకుని 'సావిత్రి' బయోపిక్ పోస్టర్

మహానాటి సావిత్రి బయోపిక్ ను యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే అధికారంగా ప్రకటన వచ్చేసింది. తాజాగా సావిత్రి పాత్రలో `నేను శైలజ` ఫేం కీర్తి సురేష్ నటిస్తున్నట్లు టీమ్ ధృవీకరించింది.

ఉమెన్స్ డే కానుకగా కేశవ న్యూ పోస్టర్స్

యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. అటు సమయం చిక్కినప్పుడల్లా కొత్త కథలను వింటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇటీవలే `ఎక్కడికిపోతావు చిన్నవాడా` తో మరో హిట్ కొట్టాడు.