బిగ్‌బాస్ 4 గ్రాండ్ ఫినాలే గెస్ట్‌గా మహేష్!?

  • IndiaGlitz, [Saturday,December 05 2020]

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న 'బిగ్‌బాస్-4' కార్యక్రమం తుది అంకానికి చేరువవుతోంది. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ షోకి శుభం కార్డు పడబోతోంది. ఈ క్రమంలోనే గ్రాండ్ ఫినాలేకు డేటు కూడా ఫిక్స్ అయింది. ఈ నెల 20వ తేదీన గ్రాండ్ ఫినాలేకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ నిర్వహించిన మూడు సీజన్ల తరహాలోనే ఈ సారి కూడా ఫినాలేను గ్రాండ్‌గానే నిర్వహించాలని బిగ్‌బాస్ యాజమాన్యం భావిస్తోంది. అయితే ‘బిగ్‌బాస్-3’ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ ఏడాది ఫినాలే విషయంలో రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ తదితరుల పేర్లు వినిపించాయి. తాజాగా కొత్తగా మరోపేరు వినిపిస్తోంది. ఈ ఏడాది ఫినాలేకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్టార్ మా నిర్వాహకులు మహేష్‌ను సంప్రదించారని కూడా టాక్ నడుస్తోంది. దీనికి మహేష్ సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తోంది. అన్నీ ఓకే అయితే ఈసారి గ్రాండ్ ఫినాలేకు మహేష్ రావడం ఖాయమని సమాచారం.

బిగ్‌బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేకు మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం హౌస్‌లో ఐదుగురు కంటెస్టెంట్‌లు మాత్రమే ఉన్నారు. ఇప్పటికే వారిలో ఒకరు రేస్ టు ఫినాలే టికెట్‌ను గెలుచుకున్నారు. మరో నలుగురికి మాత్రమే టాప్ 5లోకి అవకాశం ఉంది. ఈ వారం ఒకరు.. వచ్చే వారం ఒకరు ఎలిమినేట్ అవుతారు. అయితే ఈ వారం ఎలిమినేషన్‌లో అభిజిత్, అఖిల్, హారిక, అవినాష్, మోనాల్ ఉన్నారు. అనధికార పోల్స్ నిర్వహిస్తున్న ఓటింగ్‌ను బట్టి చూస్తే ఈసారి మోనాల్ ఎలిమినేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.

More News

రాజమౌళి శిష్యుడు దర్శకత్వంలో కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ‘కథ మొదలైంది’

దేశం గర్వించదగిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడైన సాయికృష్ణ కేవీ దర్శకత్వంలో ‘కథ మొదలైంది’

బీజేపీలోకి జానారెడ్డి.. నాగార్జున సాగర్ నుంచి బరిలోకి?

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావం కాంగ్రెస్ పార్టీపై దారుణంగా పడనుందా? కౌంటింగ్ ముగిసిన గంటల్లోనే అనూహ్య పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ వేదికవుతోందా?

వైసీపీలో చేరిన జనసేన ఎమ్మెల్యే రాపాక తనయుడు...

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తనయుడు రాపాక వెంకట్రామ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఆమె ఓటమి స్వయంకృతాపరాధం.. ఆసక్తికరంగా టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి..

స్వయం కృతాపరాధం.. అనే మాటను తరచూ వింటూనే ఉంటాం. అలాంటి స్వయం కృతాపరాధమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓ అభ్యర్థి కొంపముంచింది.

ఎవరికీ రాని మేజిక్ ఫిగర్.. గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు..!

మేజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాలేదు. గ్రేటర్ ప్రజానీకం అన్ని పార్టీలను గెలుపు ముంగిట నిలబెట్టేసి తేల్చుకోమని బిగ్ టాస్క్ ఇచ్చినట్టుగా అయింది.