కొండారెడ్డి బురుజు వ‌ద్ద మ‌రోసారి మ్యాజిక్

  • IndiaGlitz, [Monday,September 23 2019]

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ప్ర‌స్తుతం ఈ సినిమా హైద‌రాబాద్ రామోజీ ఫిలిమ్ సిటీలో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. క‌ర్నూలు కొండారెడ్డి బురుజు వ‌ద్ద చిత్రీక‌రించిన 'ఒక్క‌డు' సినిమా స‌రికొత్త హిస్ట‌రీని క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమా కోసం రామోజీ ఫిలిమ్ సిటీలో కొండారెడ్డి బురుజు భారీ సెట్‌ను వేసి షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షెడ్యూల్‌ జరుగుతోంది. 2020 సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ...

నిర్మాత అనీల్ సుంక‌ర మాట్లాడుతూ - ''16 ఏళ్ల క్రితం వెండితెర‌పై కొండారెడ్డి బురుజు లొకేష‌న్ ఐకాన్‌గా మారింది. మ‌ళ్లీ ఇప్పుడు ఆ లొకేష‌న్‌కు వ‌చ్చాం. అయితే ఈసారి మ‌రింత పెద్ద‌దిగా లొకేష‌న్‌ను ఆవిష్క‌రించనున్నాం. మా ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ఎ.ఎస్‌.ప్ర‌కాశ్.. కొండారెడ్డి బురుజు లొకేష‌న్‌ను అద్భుత‌మైన రీతిలో తీర్చిదిద్ది రామోజీ ఫిలిమ్ సిటీలో ఆవిష్కరించారు'' అన్నారు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ దిల్‌రాజు మాట్లాడుతూ - ''మ‌హేశ్‌, కొండారెడ్డి బురుజు అనే ఎపిక్ కాంబినేష‌న్ ఈ సంక్రాంతికి మీ ముందుకు రానుంది'' అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, ప్రకాష్ రాజ్ , రాజేంద్రప్రసాద్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ పనిచేస్తున్న సాంకేతిక వర్గం.

More News

'ఉల్లాలా ఉల్లాలా' తో తెలుగులోకి ఎంట‌ర‌వుతున్న‌`ల‌వ‌ర్స్ డే` ఫేమ్ నూరిన్‌

మ‌ల‌యాళంలో సంచ‌ల‌నం సృష్టించిన `ఒరు ఆదార్ ల‌వ్‌` చిత్రం రిలీజ్‌కి ముందు ప్రియా వారియ‌ర్‌కి ఎంత పేరు తీసుకొచ్చిందో, రిలీజ్ త‌ర్వాత నూరిన్‌కి అంత పేరు తీసుకువచ్చింది.

సినిమాల్లోకి ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి!

టైటిల్ చూడగానే ఇదేంటి.. డిప్యూటీ సీఎం సినిమాల్లోకి వస్తున్నారా..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే.

అజయ్‌కు రవితేజ ‘నో’ చెప్పడానికి కారణమిదేనట

‘ఆర్ ఎక్స్100’ సినిమాతో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి పేరు ఈ మధ్య అస్తమాను వార్తల్లో వినపడుతోంది.

అల‌.. బ‌న్నీ డేట్ ఫిక్స్‌

స్టైలిష్ స్టార్ తాజా చిత్రం `అల..వైకుంఠ‌పుర‌ములో..`  చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడు.

ఎన‌ర్జీలో అన్న‌య్య‌ని కొట్టేవాడు పుట్ట‌డు: పూరి జ‌గ‌న్నాథ్‌

భారీ అంచ‌నాలు న‌డుమ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` అక్టోబ‌ర్ 2న విడుద‌ల‌వుతుంది.