వరల్డ్ రికార్డుగా మహేష్ బర్త్‌డే..

  • IndiaGlitz, [Monday,August 10 2020]

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు నేడు. తన బర్త్‌డే ప్రపంచ రికార్డ్‌కు వేదిక అవుతుందని మహేష్ కూడా ఊహించి ఉండడు. కానీ ఇది జరిగింది. ఆయన బర్త్‌డేకి విషెస్ ట్విట్టరే షేక్ అయ్యే రేంజ్‌లో వచ్చాయి. కొన్ని కోట్ల విషెస్.. అది కూడా 24 గంటల్లోపే.. ఇంకా ట్వీట్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా.. సినీ, రాజకీయ, క్రీడా తదితర రంగాలకు చెందిన ప్రముఖులంతా ట్వీట్ల వర్షం కురిపించారు.

ఇక అభిమానుల గురించైతే చెప్పనక్కర్లేదు. ఈసారి మహేష్ బర్త్‌డేను నిర్వహించలేకపోయామన్న బాధ లేకుండా తమ ప్రేమనంతా ట్విట్టర్ వేదికగా మహేష్‌పై కురిపించారు. దీంతో 24 గంటల్లో 60.2 మిలియన్ల ట్వీట్లు వచ్చాయి. ఇది వరల్డ్ రికార్డ్ అని మహేష్ పీఆర్ టీమ్ వెల్లడించింది. #HBDMaheshBabu అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇప్పటికీ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఈ రోజు పూర్తయ్యేసరికి మరింకెన్ని ట్వీట్స్ వస్తాయో వేచి చూడాలి.