యాక్షన్ సీన్స్ లో మహేష్ బిజీ..!

  • IndiaGlitz, [Monday,October 17 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. తెలుగు, త‌మిళ్ లో ఈ భారీ చిత్రాన్ని దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందిస్తున్నారు.
ఈ మూవీ కోసం మ‌హేష్ పై కొన్ని యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రిస్తున్నారు. హైద‌రాబాద్ లో చిత్రీక‌రిస్తున్న ఈ యాక్ష‌న్ సీన్స్ ను పీట‌ర్ హెయిన్స్ నేతృత్వంలో షూట్ చేస్తున్నారు. డైరెక్ట‌ర్ ఎస్.జె.సూర్య ఈ చిత్రంలో విల‌న్ గా న‌టిస్తుండ‌డం విశేషం. సండే కూడా సెల‌వు తీసుకోకుండా మ‌హేష్ బాబు ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొన్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ను డిసెంబ‌ర్ కి పూర్తి చేసేలా ప్లాన్ చేసారు. ఈ భారీ చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

More News

స్పెషల్ ఇజం - సర్ ఫ్రైజ్ ఫర్ ఫ్యాన్స్ - పూరి..!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఇజం.

దీపావళికి వస్తున్న గోపీచంద్..!

చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు లతో సక్సెస్ ఫుల్ మాస్ మూవీస్ అందించిన మాస్ డైరెక్టర్ బి.గోపాల్ ఇప్పుడు గోపీచంద్ తో ఓ మూవీ చేస్తున్నారు. గోపీచంద్ - బి.గోపాల్ కాంబినేషన్ రూపొందే యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను జయ బాలాజీ రియల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తుంది

నవంబర్ 11న ఎక్కడికి పోతావు చిన్నవాడా విడుదల

స్వామిరారా, కార్తికేయ, సూర్య వెర్సెస్ సూర్య' లాంటి వైవిధ్యమైన కథాంశాలతో విజయం సాధించి యూత్ లో యంగ్ఎనర్జిటిక్ స్టార్ గా ఎదిగిన హీరో నిఖిల్ మరో వినూత్నమైన కథాంశంతో వస్తున్న చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా.

చిరంజీవిని ఎత్తేస్తుంది...

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియస్ 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం తమిళ హిట్ చిత్రం కత్తికి రీమేక్.

హాలీవుడ్ రీమేక్ లో విక్రమ్....

రీసెంట్ గా ఇంకొక్కడు చిత్రంతో మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న చియాన్ విక్రమ్ ఇప్పుడు హరి దర్శకత్వంలో స్వామి2 సినిమా కోసం రెడీ అవుతున్నాడు.