close
Choose your channels

'నువ్ లేకుంటే నేను లేను.. మళ్లీ జన్మ వుంటే నువ్వే నాకు అన్నవి' : రమేశ్ మరణంపై మహేష్ భావోద్వేగం

Sunday, January 9, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నువ్ లేకుంటే నేను లేను.. మళ్లీ జన్మ వుంటే నువ్వే నాకు అన్నవి : రమేశ్ మరణంపై మహేష్ భావోద్వేగం

సూపర్‌‌సార్ట్ కృష్ణ పెద్దకుమారుడు రమేష్ బాబు శనివారం రాత్రి అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. కాలేయ సంబంధిత అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. శనివారం సాయంత్రం రమేశ్ బాబు తీవ్ర అస్వస్థతకు గురవడంతో గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కృష్ణ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇప్పటికే భార్యను కోల్పోయిన ఆయనకు కుమారుడి మరణం షాక్‌లా తగిలింది. దీంతో కృష్ణను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. అటు మహేశ్ బాబు బాధ వర్ణనాతీతం. సొంత అన్నయ్య చనిపోయినా.. చివరి చూపు కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మహేష్ బాబు. కొద్దిరోజుల క్రితం ఆయనకు కరోనా రావడంతో ఐసొలేషన్‌లో ఉంటున్నారు. దీంతో రమేశ్‌బాబు అంత్యక్రియలకు వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా అన్నయ్యకు నివాళులు అర్పించారు.

నువ్ లేకుంటే నేను లేను.. మళ్లీ జన్మ వుంటే నువ్వే నాకు అన్నవి : రమేశ్ మరణంపై మహేష్ భావోద్వేగం

'నువ్వే నాకు స్ఫూర్తి.. నువ్వే నా బలం.. నువ్వే నా ధైర్యం.. నాకంతా నువ్వే.. నువ్ లేకుంటే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు. నువ్ నాకోసం చేసిన అన్నింటికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి తీస్కో.. ఈ జీవితంలోనే కాదు.. నాకు మరో జీవితం ఉంటే అప్పటికీ నువ్వే నా అన్నయ్య.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ మహేశ్ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

రమేష్ బాబుతో మహేష్ బాబుకి మంచి అనుబంధం ఉండేది. అన్నయ్యగా కంటే తండ్రిగా మహేష్ బాబుని అపురూపంగా చూసుకునేవారు రమేష్ . కృష్ణ సినిమాలతో బిజీగా ఉండడంతో.. మహేష్ బాధ్యతలను రమేష్ చేపట్టారు. ఆ క్రమంలోనే రమేశ్‌ అంటే మహేష్ కి అమితమైన ప్రేమ. తనకు ఎలాంటి ఇబ్బంది వున్నా అన్నయ్య దగ్గరకే వెళ్లేవారు ..అలాంటి వ్యక్తిని కోల్పోవడం మహేష్‌కి వ్యక్తిగతంగా ఎప్పటికీ తీరని లోటు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.