ఈ సంక్రాంతి ఆ లెక్కన మహేష్ కి ఓకే..

  • IndiaGlitz, [Saturday,August 12 2017]

సూప‌ర్ స్టార్ కృష్ణ‌కి సంక్రాంతి అచ్చొచ్చిన సీజ‌న్‌. ఆ పండ‌గ స‌మ‌యంలో రిలీజైన చాలా చిత్రాలు కృష్ణ కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్స్ గా నిలిచాయి. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో నెంబ‌ర్ వ‌న్‌, అమ్మ‌దొంగా వంటి ఘ‌న‌విజ‌యాలు సొంత‌మైంది కూడా ఆ పండ‌గ స‌మ‌యంలోనే. అలా తండ్రికి క‌లిసొచ్చిన సంక్రాంతికి అప్పుడ‌ప్పుడు త‌న సినిమాల‌తో సంద‌డి చేస్తున్నాడు మ‌హేష్‌. వాటిలో ఒక్క‌డు, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు వంటి విజ‌యాలుండ‌గా.. ట‌క్క‌రి దొంగ‌, 1-నేనొక్క‌డినే లాంటి ప్ర‌యోగాలూ ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. వ‌చ్చే సంక్రాంతికి కూడా మ‌హేష్ సంద‌డి చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న భ‌ర‌త్ అనే నేనుని జ‌న‌వ‌రి 11నే విడుద‌ల చేయ‌నున్నార‌ని స‌మాచారమ్‌. సంక్రాంతికి రిలీజైన గ‌త చిత్రం 1-నేనొక్క‌డినే స‌క్సెస్ అయిపోయినా.. ఆ సీజ‌న్‌లో విడుద‌లై మంచి హిట్ అయిన సీత‌మ్మ‌.. రిలీజ్ రోజునే భ‌ర‌త్ అనే నేను ని తీసుకురావ‌డం చూస్తే ఆ సెంటిమెంట్ మ‌హేష్‌కి మ‌రోసారి క‌లిసొచ్చేలాగే ఉంది.

More News

కాజల్ కి భలే కలిసొచ్చారుగా..

కాజల్ అగర్వాల్..ఫ్లాప్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా టర్న్ అయిన ఓ టాలెంటెడ్ యాక్ట్రస్.

ఈ నెల17న ఖమ్మంలో 'పైసా వసూల్' ఆడియో!

సినిమా ప్రారంభోత్సవం రోజున విడుదల తేదీ ప్రకటించడం ఇటీవల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జరుగుతున్నదే.

తమిళంలోకి నాగ్ సినిమా...

తెలుగులో నాగార్జున ప్రధాన పాత్ర హథీరాంబాబాగా,సౌరభ్ జైన్ వేంకటేశ్వరునిగా నటించిన చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'.

వైభవ్ క్రేజీ ప్రాజెక్ట్ 'మెయాదా మాన్' తెలుగులో భారీగా విడుదలకు సన్నహాలు

సరోజ,యాక్షన్ త్రీడీ,అనామిక లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కథానాయకుడు వైభవ్.

రెండు వారాల గ్యాప్ తో.. రెండు సినిమాలు..

హిందీ సినిమాల మాటెలా ఉన్నా..టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కి తెలుగు,తమిళ భాషల్లో మంచి క్రేజ్ నే ఉంది.