బ్ర‌హ్మోత్స‌వం - ప్లాపోత్స‌వం ఆర్టిక‌ల్ పై అభ్యంత‌రం

  • IndiaGlitz, [Tuesday,May 24 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించిన చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఇటీవ‌ల రిలీజైన బ్ర‌హ్మోత్స‌వం చిత్రం గురించి సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లో దురాభిమానులు దుష్ర్ప‌చారం చేస్తున్నారు. అయితే...దురాభిమానులు చేసే దుష్ర్ప‌చారాన్నితెలియ‌చేస్తూ... ప్ర‌ముఖ ఆంగ్ల దిన ప‌త్రిక ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ బ్ర‌హ్మోత్స‌వం - ప్లాపోత్స‌వం అంటూ ఓ ఆర్టిక‌ల్ ప్ర‌చురించింది. ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ లో ఈ రోజు ప్ర‌చురించిన బ్ర‌హ్మోత్స‌వం ఫ్లాపోత్స‌వం ఆర్టిక‌ల్ పై మ‌హేష్ అభిమానులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు.

మ‌హేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దిడ్డి రాంబాబు, ఖాద‌ర్ ఘోరి త‌దిత‌రులు ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ యాజ‌మాన్యంతో ఈ విష‌యం పై చ‌ర్చ‌లు జ‌రిపారు. అనంత‌రం మ‌హేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దిడ్డి రాంబాబు మాట్లాడుతూ...మా అభిమాన హీరో మ‌హేష్ వివాదాల‌కు దూరంగా ఉండే వ్య‌క్తి. అలాంటి వ్య‌క్తి పై ఇలాంటి వార్త‌లు ప్ర‌చురించ‌డం బాధాక‌రం. మేము ఏమైతే అభ్యంత‌రం వ్య‌క్తం చేసామో...వాటిని ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ యాజ‌మాన్యం గుర్తించి రేపు బ్ర‌హ్మోత్స‌వం పై మ‌రో ఆర్టిక‌ల్ రాసేందుకు అంగీక‌రించింది. అలాగే భ‌విష్య‌త్ లో ఇలాంటివి మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా చూస్తాం అని హామీ ఇచ్చారు. అందుచేత ద‌య‌చేసి అభిమానులు ఎవ‌రూ బాధ‌ప‌డ‌ద్దు అని తెలియ‌చేస్తున్నాను అన్నారు.

More News

ఈనెల 27న విడుదలౌతున్న యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ 'రహదారి'

సేతు,అభిషేక్,రాజ్,పూజ,ఉమాశంకర్,శ్వేత,విజయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం రహదారి.

టీజ‌ర్ తో సంచ‌ల‌నం సృష్టిస్తున్న‌ సంపూ..

హృద‌య కాలేయం సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన సంపూర్ణేష్ బాబు..కొబ్బ‌రిమ‌ట్ట సినిమాతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్      కొబ్బ‌రిమ‌ట్ట టీజ‌ర్ ను రిలీజ్ చేసారు.

సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ డేట్ ఖరారు...

నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రం సాహసం శ్వాసగా సాగిపో.

బ్ర‌హ్మోత్స‌వం రిజ‌ల్ట్ కి కార‌ణం ఇదే..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించిన తాజా చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రం ఈ నెల 20న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది.

చిరు 150వ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఇటీవ‌ల ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.