అడ‌విలో మ‌హేశ్ ఫైట్‌

  • IndiaGlitz, [Monday,November 18 2019]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'స‌రిలేరు నీకెవ్వ‌రు'. సినిమా ఇప్పుడు తుది దశ చిత్రీకరణకు చేరుకుంది. ప్ర‌స్తుతం సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. అందులో భాగంగా అడ‌విలో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెలియ‌జేశారు. ఈ సినిమా ఈ టీజర్‌ను నవంబర్‌ 23న విడుదల చేస్తారట. ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలతో డిజిటల్‌, శాటిలైట్‌ హక్కులు బిజినెస్‌ పూర్తయ్యింది. హిందీలో మన సినిమాలకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఓ మోస్తరు సినిమాలకు హిందీలో మంచి డిజిటల్‌ , శాటిలైట్‌ బిజినెస్‌ జరుగుతుంది.

రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్‌ నటి విజయశాంతి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈమె ప్రొఫెసర్‌ భారతి అనే పాత్రలో నటిస్తున్నారు. మహేశ్‌ ఇందులో ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఇంకా ప్రకాశ్‌రాజ్‌, రాజేంద్‌ ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ౠమహర్షిౠ తర్వాత మహేశ్‌ నటిస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి అనిల్‌ సుంకర, దిల్‌రాజులతో పాటు మహేశ్‌ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

More News

రాజ్‌ మాదిరాజు 'సిరా' పుస్కకావిష్కరణ

విద్యావ్యవస్థలో లోపాలను, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని, వాళ్ళ ఆత్మహత్యలకు గల కారణాలను విశ్లేషిస్తూ...

సూపర్ స్టార్ తో 'దర్బార్' చేయడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్: ఏ ఆర్ మురుగదాస్

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`.

'జార్జిరెడ్డి' మూవీకి ఊహించని షాక్.. రిలీజ్ కష్టమేనా!?

సందీప్ మాధ‌వ్ టైటిల్ పాత్రలో న‌టించిన చిత్రం ‘జార్జ్‌రెడ్డి’. జీవ‌న్ రెడ్డి ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ న‌వంబ‌ర్ 22న విడుద‌ల కానుంది.

నిజానికి అది పవన్ కళ్యాణ్ చేయాలనుకున్నారు: సందీప్ మాధవ్

ఈ నెల 22 న రిలీజవుతుంది ‘జార్జిరెడ్డి’ సినిమా. సందీప్ మాధవ్ ఈ సినిమాలో ‘జార్జిరెడ్డి’ గా నటించాడు.

ఇసుక అక్రమంగా తరలిస్తే ఈ నంబర్‌కు కాల్ చేయండి!

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇసుక అధిక ధరలకు అమ్మినా, అక్రమ రవాణా చేసినా ప్రభుత్వం తాట తీసేస్తుంది అంతే.!