సూప‌ర్‌స్టార్‌ని ఫాలో అవుతున్న మహేశ్..!

ద‌క్షిణాది సూప‌ర్‌స్టార్ ఇమేజ్ ఉన్న ర‌జినీకాంత్‌కు ఆధ్యాత్మిక చింత‌న ఎక్కువ‌. ప్ర‌తి ఏడాది ఆయ‌న హిమాల‌యాల‌కు వెళ్లి వ‌స్తుంటారు. ఇప్పుడు ఆయ‌న రూట్‌లో టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ హిమాల‌యాల‌కు వెళుతున్నాడా? అంటే అవుననే వార్త‌లు ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతుంది. ప్ర‌తి స‌మ్మ‌ర్‌లో కుటుంబంతో స‌హా విదేశాల‌కు వెళ్లి వ‌చ్చే మ‌హేశ్‌.. ఈసారి హిమాల‌యాల‌కు వెళ్లాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. భార్య న‌మ్ర‌త‌, పిల్ల‌ల‌తో క‌లిసి మ‌హేశ్ హిమాల‌యాల‌కు వెళ‌తాడా? లేక త‌నొక్క‌డే వెళ‌తాడా? అనే దానిపై క్లారిటీ రావ‌డం లేద‌ట‌.

ఈ ఏడాది ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’తో హిట్ కొట్టిన మ‌హేశ్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 27వ సినిమాను స్టార్ట్ చేస్తాడని అనుకున్నారు. కానీ సినిమా వాయిదా పడటంతో ఆ స్థానంలో పరుశురామ్ సినిమాను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అందుకు ఇంకా స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. ఆలోపు మ‌హేశ్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నార‌ట‌. డైరెక్ట‌ర్ కొర‌టాల తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాలో మ‌హేశ్ పోర్ష‌న్ చిత్రీక‌రించ‌డానికి ఇంకా స‌మ‌యం ఉండ‌టంతో ఆలోపు హిమాల‌యాల‌కు ట్రిప్ వేయాల‌నేది మ‌హేశ్ ఆలోచ‌న‌గా తెలుస్తుంద‌ట‌.