నాని ఆడియోకి అతిథిగా మహేష్..

  • IndiaGlitz, [Saturday,January 16 2016]

భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాతో స‌క్సెస్ సాధించిన‌ యువ హీరో నాని న‌టిస్తున్న తాజా చిత్రం క్రిష్ణ గాడి వీర ప్రేమ గాథ‌. ఈ చిత్రాన్ని హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించారు. 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ నెల 20న క్రిష్ణ గాడి వీర ప్రేమ గాథ ఆడియోను ఘ‌నంగా రిలీజ్ చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విశాల్ చంద్ర శేఖ‌ర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...ఈ ఆడియో వేడుక‌కు సూప‌ర్ స్టార్ మ‌హేష్ ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు. ఈ వేడుక‌లో ఆడియో తో పాటు థియేట‌ర్ ట్రైల‌ర్ మ‌హేష్ రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమా ద్వారా మెహ‌రీన్ హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతున్నారు.ఫిబ్రవ‌రి మొద‌టివారంలో ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.
మ‌రి... అందాల రాక్షసి సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించ‌లేక‌పోయిన హ‌ను రాఘ‌వ‌పూడి క్రిష్ణ గాడి వీర ప్రేమ గాథ తో అయినా స‌క్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

More News

'ఎక్స్ ప్రెస్ రాజా' మూవీ రివ్యూ

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు వంటి రెండు వరుస విజయాలు తర్వాత శర్వానంద్ నటించిన చిత్రమే ఎక్స్ ప్రెస్ రాజా. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన చిత్రం కూడా ఇదే.

డిక్టేటర్ మూవీ రివ్యూ

సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ సాధించిన నందమూరి బాలకృష్ణ వందవ చిత్రానికి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇలాంటి సందర్భంలో ప్రతి సినిమాపై అంచనాలు భారీగానే ఉంటాయి.

'ఎక్స్ ప్రెస్ రాజా' టీంను ప్రత్యేకంగా అభినందించిన మెగా పవర్ స్టార్ రాంచరణ్

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్... హీరో శర్వానంద్ తో పాటు ఎక్స్ ప్రెస్ రాజా చిత్ర టీంకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రేపే (జనవరి 14) ఎక్స్ ప్రెస్ రాజా ప్రపంచవ్యాప్తంగా గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

పల్లెటూరి వాతావరణాన్ని సరికొత్తగా చూపించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సోగ్గాడే చిన్ని నాయనా - నాగార్జున

కింగ్ నాగార్జున నటించి..నిర్మించిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా.ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కళ్యాణ్ క్రిష్ణ తెరకెక్కించారు.

వారం ఆలస్యంగా వస్తున్న విశాల్...

పందెంకోడి,పొగరు,భరణి,ఇంద్రుడు,పూజ,జయసూర్య వంటి మాస్ కమర్షియల్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన మాస్ హీరో విశాల్