close
Choose your channels

ఎన్టీఆర్ స‌ర‌స‌న మ‌హేశ్ హీరోయిన్‌?

Friday, November 27, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్టీఆర్ స‌ర‌స‌న మ‌హేశ్ హీరోయిన్‌?

టాలీవుడ్‌లో ఎవ‌రైనా స్టార్ హీరో సినిమా మొద‌లైందంటే.. ఆ హీరో స‌ర‌స‌న న‌టించ‌బోయే జోడీ ఎవ‌రా అనే ఆస‌క్తి అంద‌రిలోనూ క్రియేట్ అవుతుంది. స్టార్ హీరో స‌ర‌స‌న ప‌లువురు స్టార్ హీరోయిన్స్ పేర్లు విన‌ప‌డ‌టం మ‌నం చూస్తూనే ఉంటాం. అలా ప్ర‌ముఖంగా వినిపించే హీరోయిన్స్ పేర్ల‌లో కియరా అద్వానీ ఒక‌రు. ఈ బాలీవుడ్ సొగ‌స‌రి తెలుగులో మ‌హేశ్ స‌ర‌స‌న ‘భ‌ర‌త్ అనే నేను’, రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న ‘విన‌య‌విధేయరామ’ చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత కియ‌రా అద్వానీ మ‌రో సినిమాలో న‌టించ‌లేదు. కానీ నిర్మాత‌లు కియరాను ఇక్క‌డ హీరోయిన్‌గా న‌టింప చేయాల‌ని అనుకున్నా కూడా.. ఆమె బిజీగా ఉండటంతో కుదరలేదు. అయితే త‌ర్వాత టాలీవుడ్లో ఏ స్టార్ హీరో సినిమా అనౌన్స్ అయినా హీరోయిన్ పేరు కియరా అద్వానీ పేరు వినిపిస్తూనే ఉంది.

ఇప్పుడు మ‌రోసారి ఓ స్టార్ హీరో స‌ర‌స‌న కియ‌రా అద్వానీ జోడీగా న‌టిస్తుంద‌ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆ హీరో ఎవ‌రో కాదు.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. ప్ర‌స్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ దీని త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే, ర‌ష్మిక మంద‌న్న పేర్లు వినిపించాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా కియరా అద్వానీ పేరు వినిపిస్తోంది. ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.