క్రైమ్ డ్రామాలో మహేష్

  • IndiaGlitz, [Saturday,January 19 2019]

సూపర్‌స్టార్ మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపపల్లి దర్శకత్వంలో తన 25వ చిత్రం ‘మ‌హర్షి’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. దీని తర్వాత మహేష్‌.. సుకుమార్ దర్శకత్వంలో వైుత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై సినిమా చేయుబోతున్నారు. ఇది పూర్తి కాగానే 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. సందీప్ డైరెక్షన్‌లో మహేష్ ప్రాజెక్ట్ చాలా రోజులుగా వినపడుతున్నదే.

అయితే ఉన్న కమిట్‌మెంట్ కారణంగా 'మహర్షి'తో బిజీ అయ్యారు. ఆలోపు సందీప్ వంగా ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్ రీమేక్ ‘కబీర్ సింగ్’ పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ రీమేక్ పని పూర్తి చేసిన సందీప్ మహేష్ సినిమా స్క్రిప్ట్‌పై పూర్తి స్థాయిలో వర్క్ చేయాల్సి ఉంది. ఈలోపు మహేష్ సుకుమార్ సినిమాను కూడా పూర్తి చేసుకుంటాడు. మహేష్ కోసం సందీప్ వంగా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో కథను సిద్ధం చేస్తున్నాడని వార్తలు వినపడుతున్నాయి.