ఇక రెండు నెల‌లు మ‌హేశ్ క‌న‌ప‌డ‌డు...!!

  • IndiaGlitz, [Monday,January 20 2020]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఈ సంక్రాంతికి 'స‌రిలేరునీకెవ్వ‌రు'తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. పెద్ద స‌క్సెస్‌ను సొంతం చేసుక‌న్న సంగ‌తి తెలిసిందే. సినిమా షూటింగ్‌ల నుండి ఏమాత్రం ఖాళీ దొరికినా ఫ్యామిలీతో పాటు వెకేష‌న్స్‌కు చెక్కేసే మ‌హేష్‌.. ఇప్పుడు కూడా అదే ప‌నిచేశాడు. మ‌హేశ్, న‌మ్ర‌త‌, గౌత‌మ్‌, సితార‌ల‌తో అమెరికాకు ఫ్లైట్ ఎక్కేశారు. వీరితో పాటు మెహ‌ర్ ర‌మేష్ కూడా వెళ్ల‌డం విశేషం. ఈ వెకేష‌న్ రెండు నెల‌లు పాటు సాగుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఫ్యామిలీతో స‌హా అమెరికా వెళుతుండ‌గా శంషాబాద్ ఎయిర్ పోర్టులో తీసిన ఫొటోను న‌మ‌త్ర త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. మేం వెళ్తున్నాం, హ్యాపీహాలీడేస్‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ కా బాప్‌, స‌రిలేరు నీకెవ్వ‌రు అనే ప‌దాల హ్యాష్ ట్యాగ్‌ల‌కు కూడా జ‌త చేశారు.

మ‌హేశ్‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'సరిలేరు నీకెవ్వ‌రు'. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ చిత్రం తొలి వారంలోనే 100 కోట్ల రూపాయ‌ల‌కు పైగా షేర్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌గా.. విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా కోసం ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూగా షూటింగులో పాల్గొన్న మ‌హేశ్... సినిమా విడుద‌లైన మొత్తం ప్ర‌మోష‌న్స్ పూర్త‌వ‌గానే వెకేష‌న్‌కు వెళ్లిపోయాడు. అదీ కూడా లాంగ్ వెకేష‌న్‌. రాగానే వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాన‌ని మ‌హేశ్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

More News

`పింక్` మొద‌లెట్టిన ప‌వ‌న్‌.. వైర‌ల్ అవుతున్న ప‌వ‌న్ ఫొటో

జ‌న‌సేన‌నాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ సినిమా `పింక్‌`ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

అల్ల‌రి న‌రేశ్ కొత్త ప్ర‌య‌త్నం.. రీ ఎంట్రీ అనుకోవాలా?

నేటి త‌రం హీరోల్లో కామెడీ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు అల్ల‌రి న‌రేశ్‌. త‌న‌దైన కామెడీ టైమింగ్ ఉన్న సినిమాల‌తో చాలా త్వ‌ర‌గా 50 సినిమాల‌ను చాలా త్వ‌ర‌గా పూర్తి చేసుకున్న అల్లరి న‌రేశ్‌కి

ఫైట‌ర్ స్టార్ట్‌... బాలీవుడ్ హీరోయిన్‌తో రొమాన్స్‌

యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో

మా నాన్నతో కలిసి మొదటిసారి ఇండస్ట్రీ రికార్డ్ కొడుతున్నాను: అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'అల.. వైకుంఠపురములో' సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల్ని బద్దలుకొడుతూ దూసుకుపోతోంది.

ఆక్ట‌టుకుంటోన్న బాల‌కృష్ణ స‌రికొత్త లుక్‌

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ తాజా చిత్రం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.