close
Choose your channels

మరోసారి అదే డైరెక్టర్ తో మహేష్ బాబు

Friday, October 18, 2019 • తెలుగు Comments

మ‌రోసారి సినిమా చేయాల‌నుకుంటున్న మ‌హేశ్‌

సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌తో సినిమాలు చేయాల‌ని ప్ర‌తి ద‌ర్శ‌కుడికీ ఉంటుంది. అయితే మ‌హేశ్‌కి మాత్రం న‌చ్చిన ద‌ర్శ‌కులు కొంత మందే. రీసెంట్ టైమ్‌లో మ‌హేశ్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వెంట వెంట‌నే సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. కొరటాల‌తో మ‌హేశ్ వ‌రుస సినిమాలు చేయ‌డానికి కార‌ణం.. మ‌హేశ్‌కు త‌గ్గ‌ట్టు కొరటాల సినిమాలు చేయ‌డ‌మే. ఇప్పుడు అలాంటి మ‌రో ద‌ర్శ‌కుడు మ‌హేశ్‌కి బాగా న‌చ్చేశాడు. ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. అనీల్ రావిపూడి. 

ప్ర‌స్తుతం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`.  సినిమా సెట్స్‌లో ప‌రిస్థితుల‌ను అనీల్ హ్యాండిల్ చేసిన తీరు బాగా న‌చ్చ‌డంతో మహేశ్ మ‌రోసారి అది కూడా వెంట‌నే అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే ఇది అధికారికంగా తెలియ‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టేలానే ఉంది.

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా తెర‌కెక్కుతోన్న `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమాను అనీల్ సుంక‌ర‌, దిల్‌రాజు, మ‌హేశ్ నిర్మిస్తున్నారు. వ‌చ్చే సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. 

Get Breaking News Alerts From IndiaGlitz