close
Choose your channels

క్రికెట్ ఆడుతున్న మ‌హేశ్‌...

Thursday, August 2, 2018 • తెలుగు Comments

క్రికెట్ ఆడుతున్న మ‌హేశ్‌...

సూప‌ర్‌స్టార్ మహేశ్ వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 25వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోఉంది. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఓ భాగంలో మహేశ్ స్టూడెంట్‌గా కూడా క‌న‌ప‌డ‌తాడు.

స్టూడెంట్ సన్నివేశాల‌ను ఇది వ‌ర‌కు చిత్రీక‌రించేశారు. తాజ‌గా త‌న స్నేహితుల‌తో క‌లిసి మ‌హేశ్ క్రికెట్ ఆడ‌బోయే స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తారు.  హైద‌రాబాద్ పోలీస్ ఆకాడ‌మీలో ఈ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, అశ్వ‌నీద‌త్ నిర్మిస్తారు.