మహేష్‌ను సౌత్ ఇండియాలోనే టాప్‌లో నిలిపిన అభిమానులు

  • IndiaGlitz, [Thursday,July 02 2020]

టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్‌బాబుకి ప్రత్యేక స్థానముంది. ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ సైతం మహేష్‌కి బాగా కనెక్ట్ అవుతారు. ఆయన ఫ్యామిలీకిచ్చే ప్రిఫరెన్స్ వేరే ఏ నటుడు కూడా ఇవ్వరనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ తన సక్సెస్ రేటును పెంచుకుంటూ తనదైన శైలిలో మహేష్ దూసుకెళుతున్నారు. ఇక త్వరలో రాజమౌళితో పాన్ ఇండియా సినిమాకు సైతం మహేష్ సిద్ధమవుతున్నాడు.

ఇక సోషల్ మీడియాలోనూ మహేష్‌కు అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహేష్‌ను సౌత్ ఇండియాలోనే ఆయన అభిమానులు టాప్‌లో నిలిపారు. తాజాగా ఆయన ట్విట్టర్ అకౌంటును ఫాలో అయ్యే వారి సంఖ్య 10 మిలియన్స్‌కు చేరుకుంది. ఇప్పటి వరకూ సౌత్ ఇండియన్ స్టార్స్‌లో ధనుష్‌ మాత్రమే 9.1 మిలియన్ ఫాలోవర్స్‌తో అగ్రస్థానంలో ఉన్నారు. తాజాగా 10 మిలియన్ ఫాలోవర్స్‌తో మహేష్ ఆయనను కూడా బీట్ చేసి అగ్ర స్థానంలో నిలవడం విశేషం.

More News

చైనాకు షాక్‌ల మీద షాక్‌లిస్తున్న భారత్

భారత్.. చైనాకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఒక్కొక్క దానిపై నిషేధం విధిస్తూ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా బుద్ది చెప్పేందుకు సిద్ధమవుతోంది.

వైష్ణ‌వ్ నెక్ట్స్ కూడా డెబ్యూ డైరెక్ట‌ర్‌తోనే..!!

మెగా క్యాంప్ హీరో సాయ‌తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ పంజా కూడా ‘ఉప్పెన’ చిత్రంతో తెరంగేట్రం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

‘నేటి చరిత్ర’ కరోనా సాంగ్ లాంచ్

పింక్స్ అండ్ బ్లూస్ (బ్యూటీ సె లూన్ అండ్ స్పా) సమర్పణలో  కరోనా పై  ఆళ్ళ రాంబాబు నటిస్తూ రూపొందించిన ‘నేటి చరిత్ర’ గీతం విడుదలైంది.

మరోసారి చై, సామ్ జోడీ..?

నాగ‌చైత‌న్య‌, సమంత జోడీ మ‌రోసారి స్క్రీన్‌పై సంద‌డి చేయ‌నున్నార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

జయరాజ్, బెన్నిక్స్‌ల మరణంపై దియా మీర్జా ట్వీట్

జయరాజ్, బెన్నిక్స్‌ అనే వ్యక్తుల మరణంపై మిస్ ఏషియా, ప్రముఖ నటి దియా మీర్జా స్పందించారు.