మహేష్..రైటో రాంగ్గో తేలేది అప్పుడే..

  • IndiaGlitz, [Wednesday,April 13 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్...రైటో రాంగ్గో తేలేది అప్పుడే...అన‌గానే ఎప్పుడు అంటారా..? సూర్య - విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్లో రూపొందిన 24 మూవీ రిలీజ్ రోజు. ఇదేంటి మ‌హేష్ రైటో..రాంగ్గో తేల‌డానికి సూర్య 24 మూవీ రిలీజ్ కి లింక్ ఏమిటి అనుకుంటున్నారా..? అస‌లు విష‌యం ఏమిటంటే...మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ 24 స్టోరీని ముందుగా మ‌హేష్ బాబు కే చెప్పారు. క‌థ విని మ‌హేష్ ఫ‌స్టాఫ్ బాగుంది. సెకండాఫ్ అంత‌గా న‌చ్చ‌లేద‌ని చెప్పాడ‌ట‌.
అప్పుడు విక్ర‌మ్ కుమార్ సూర్య‌ని సంప్ర‌దించాడు. సూర్య కి విక్ర‌మ్ కుమార్ నాలుగున్న‌ర గంట‌ల పాటు క‌థ చెప్పాడ‌ట‌. క‌థ విన్న త‌ర్వాత సూర్య ఏమీ మాట్లాడ‌కుండా లేచి నిల‌బ‌డి చ‌ప్ప‌ట్ల‌తో త‌న అభిప్రాయాన్ని చెప్పాడ‌ట‌. ఈ విష‌యాన్ని సూర్య స్వ‌యంగా 24 ఆడియో వేడుక‌లో చెప్పారు. సూర్య ని అంత‌గా ఆక‌ట్ట‌కున్న 24 స్టోరీ మ‌హేష్ కి న‌చ్చ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిటి..? ఇంత‌కీ మ‌హేష్ తీసుకున్న నిర్ణ‌యం రైటో..రాంగ్గో తెలియాలంటే 24 మూవీ రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే. అదీ సంగ‌తి.

More News

రేపు గోపీచంద్ ఆక్సిజ‌న్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్..

గోపీచంద్ హీరోగా ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆక్సిజ‌న్. ఈ చిత్రాన్ని శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

ఊపిరి శాటిలైట్ రైట్స్ పై క్లారిటీ ఇచ్చిన పి.వి.పి

టాలీవుడ్ కింగ్ నాగార్జున-కోలీవుడ్ హీరో కార్తీ కాంబినేషన్లో రూపొందిన ఊపిరి చిత్రం మూడవ వారంలోను విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ డేట్ మారింది..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న చిత్రం బ్రహ్మోత్సవం.

మ‌హేష్‌తో ఒక‌లా.. తార‌క్‌తో మ‌రోలా..

మునుప‌టిలా వ‌రుస విజ‌యాల‌ను త‌న సొంతం చేసుకోలేక‌పోతున్న‌ప్ప‌టికీ.. భారీ బ‌డ్జెట్ మూవీ ఆఫ‌ర్ల‌ను పొందుతూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది స‌మంత‌. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్న పెద్ద హీరోల సినిమాలంటే.. మ‌హేష్‌బాబుతో న‌టిస్తున్న 'బ్ర‌హ్మోత్స‌వం', ఎన్టీఆర్‌తో న‌టిస్తున్న 'జ‌న‌తాగ్యారేజ్‌'.

ఫస్ట్ ఫ్లాప్ తో ఆలోచనలో పడ్డ హీరో...

ఫస్ట్ ఫ్లాప్ తో ఆలోచనలో పడ్డ హీరో...ఎవరనుకుంటున్నారా..?హ్యాట్రిక్ హీరో రాజ్ తరుణ్.ఉయ్యాలా జంపాలా,సినిమా చూపిస్త మావ,కుమారి 21ఎఫ్..