షాకయ్యా.. ఇది హేయకరమైన చర్య.. మహేశ్ ఎమోషనల్ ట్వీట్

  • IndiaGlitz, [Tuesday,April 23 2019]

శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్లతో మారణహోమం తలపించింది!. ఈస్టర్‌ ఆదివారం రోజు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలకు వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు బాంబు దాడులకు పాల్పడ్డారు. మొత్తం ఎనిమిదిచోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 290 మందికి పైగా మృతి చెందగా.. అంతకు రెండు మూడు రెట్ల మంది చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు. ఈ భీకర ఘటనతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిని ప్రపంచదేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా ఉగ్రమూకలపై కన్నెర్రజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు.

మహేశ్ ట్వీట్ సారాంశం..

ఇది చాలా అసహ్య.. హేయకరమైన చర్య. శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇలా జరిగిందని తెలుసుకుని షాకయ్యా. ఇది ఖచ్చితంగా పిరికిపందల చర్యే. ఇలాంటి కష్టతరమైన సమయంలో శ్రీలంక బ్లాస్ట్ బాధితులు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కోసం ప్రార్థిద్దాం అని మహేశ్ బాబు ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు అభిమానులు స్పందిస్తూ శ్రీలంక కోసం ప్రార్థిద్దాం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. మహేష్, పూజా హేగ్దే జంటగా నటించిన ‘మహర్షి’ చిత్రం మే9న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

More News

వీరాభిమాని కుమారుడికి ‘పవన్ శంకర్’ అని పేరు పెట్టిన చిరు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అభిమానుల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సేవా కార్యక్రమాలు చేయడంలో మెగాభిమానులు ముందు వరుసలో ఉంటారు.

నారాయుణమూర్తికి ఫాస్-దాసరి 2019 సిల్వర్ పీకాక్ అవార్డు

గత దశాబ్దకాలంగా దాసరి పేరున అవార్డులను ప్రదానం చేస్తున్న ఫాస్ ఫిలిం సొసైటీ, హైదరాబాద్ ఫాస్-దాసరి 2019 అవార్డులను ఏప్రిల్ 28న రాజవుహేంద్రవరం

పవన్‌వి తేడా జీన్స్.. చిరు మంచి పనిచేశారు!

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ముందు రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ఫలితాలు వచ్చిన తర్వాత గుడ్ బై చెప్పేసిన బండ్ల గణేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంత దారుణమా?.. చాలా బాధాకరం: నాగబాబు

ఏపీ ఎన్నికల అనంతరం మళ్లీ ‘మై ఛానల్ నా ఇష్టం’ అంటూ మెగాభిమానులు, జనసేన కార్యకర్తల ముందుకు జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు వచ్చేశారు.

గెలుస్తామని బాబుకు ధీమా... మరోవైపు భయం!!

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు.