close
Choose your channels

ఎస్.. అనిల్‌తో మళ్లీ సినిమా చేస్తా..: మహేశ్

Friday, January 10, 2020 • తెలుగు Comments

ఎస్.. అనిల్‌తో మళ్లీ సినిమా చేస్తా..: మహేశ్

‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం ఎల్లుండి అనగా.. జనవరి 11న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతుంది. ప్రమోషన్‌లో భాగంగా సరిలేరు ఇంటర్వ్యూలో గురించి పలు ఆసక్తికర విషయాలను మహేశ్ వెల్లడించారు. ఈ క్రమంలో తన తదుపరి సినిమా ఎవరితో..? మళ్లీ అనిల్‌తో సినిమా ఉంటుందా..? అనే విషయాలపై సూపర్‌స్టార్ క్లారిటీ ఇచ్చేశారు.

మీడియా : మీకు నచ్చిన డైరెక్టర్లని రిపీట్‌ చేస్తారు కదా! అనిల్‌ రావిపూడితో మళ్లీ చేస్తారా?

మహేశ్ : డెఫినెట్‌గా చేస్తాను. ఈ సినిమా చేసిన తర్వాత అనిల్‌ రావిపూడి అంటే నాకు విపరీతమైన ఇష్టం ఏర్పడింది. దర్శకుల్లో అలాంటి ఎనర్జీ నేను చూడలేదు. ఎంత టెన్షన్‌ ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా సెట్‌లో నవ్వుతూ ఉంటారు. నేనింతవరకూ అలా ఎవర్నీ చూడలేదు. మా టీమ్‌ అంతా టెన్షన్‌గా ఉన్నప్పుడు అనిల్‌ మాత్రం చిన్న డ్యాన్స్‌ వేస్తూ నవ్విస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాజెక్ట్‌ అయిదు నెలల్లో పూర్తి చేశాడంటే నాకే సర్‌ప్రైజింగ్‌గా ఉంది’ అని మహేశ్ బాబు చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే ఇప్పటికే వంశీతో లైన్ క్లియర్ అవ్వగా.. మరి అనిల్‌తో సినిమా ఎప్పుడు ఉంటుందో..!. కాగా.. అసలు ఈ కాంబోలో సినిమా ఉంటుందా..? ఉండదా..? అనే విషయం సరిలేరు సక్సెస్‌పై ఆధారపడి ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz