close
Choose your channels

మహేష్ బాబు కొడుకా మజాకా.. గర్వపడే ఘనత సాధించిన గౌతమ్!

Thursday, June 17, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ మహేష్ బాబు వెండితెరపై టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. సినిమాలతో పాటు కుటుంబానికి కూడా సమానమైన ప్రాధాన్యత ఇచ్చే నటుడు మహేష్. మహేష్ పిల్లలు గౌతమ్, సితార తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు. మహేష్ సతీమణి నమ్రత తమ పిల్లల విశేషాలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

గౌతమ్ కంటే సితారే ఎక్కువ హుషారుగా సోషల్ మీడియాలో కనిపిస్తుండడం చూస్తూ ఉన్నాం. గౌతమ్ కాస్త తక్కువగా అభిమానులకు కనిపిస్తుంటాడు. అతడు లోప్రోఫైల్ మైంటైన్ చేస్తుంటాడు. కానీ తాజాగా నమ్రత గౌతమ్ గురించి ఓ అద్భుతమైన విషయాన్ని రివీల్ చేసి అభిమానులని సంతోష పరిచింది. గౌతమ్ ఓ అరుదైన ఘనత సాధించి తండ్రికి తగ్గ తనయుడిగా అనిపించుకున్నాడు.

ఇంతకీ గౌతమ్ సాధించిన ఘనత ఏంటంటే.. తెలంగాణాలో తన ఏజ్ గ్రూప్ లో స్విమ్మింగ్ లో గౌతమ్ టాప్ 8 గా నిలిచాడు. స్విమ్మింగ్ స్పోర్ట్ లో గౌతమ్ కి స్కిల్స్ సహజంగానే పెరిగాయట. 2018నుంచి గౌతమ్ స్విమ్మింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొంటున్నట్లు నమ్రత తెలిపింది.

బటర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, బ్రేస్ట్ స్ట్రోక్, ఫ్రీ స్టైల్ ఇలా అన్నివిధాలుగా గౌతమ్ స్విమ్ చేయగలడట. నమ్రత రివీల్ చేసిన ఈ న్యూస్ తో మహేష్ అభిమానులంతా గౌతమ్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.