మహేష్ బాబు కొడుకా మజాకా.. గర్వపడే ఘనత సాధించిన గౌతమ్!

  • IndiaGlitz, [Thursday,June 17 2021]

సూపర్ స్టార్ మహేష్ బాబు వెండితెరపై టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. సినిమాలతో పాటు కుటుంబానికి కూడా సమానమైన ప్రాధాన్యత ఇచ్చే నటుడు మహేష్. మహేష్ పిల్లలు గౌతమ్, సితార తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు. మహేష్ సతీమణి నమ్రత తమ పిల్లల విశేషాలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

గౌతమ్ కంటే సితారే ఎక్కువ హుషారుగా సోషల్ మీడియాలో కనిపిస్తుండడం చూస్తూ ఉన్నాం. గౌతమ్ కాస్త తక్కువగా అభిమానులకు కనిపిస్తుంటాడు. అతడు లోప్రోఫైల్ మైంటైన్ చేస్తుంటాడు. కానీ తాజాగా నమ్రత గౌతమ్ గురించి ఓ అద్భుతమైన విషయాన్ని రివీల్ చేసి అభిమానులని సంతోష పరిచింది. గౌతమ్ ఓ అరుదైన ఘనత సాధించి తండ్రికి తగ్గ తనయుడిగా అనిపించుకున్నాడు.

ఇంతకీ గౌతమ్ సాధించిన ఘనత ఏంటంటే.. తెలంగాణాలో తన ఏజ్ గ్రూప్ లో స్విమ్మింగ్ లో గౌతమ్ టాప్ 8 గా నిలిచాడు. స్విమ్మింగ్ స్పోర్ట్ లో గౌతమ్ కి స్కిల్స్ సహజంగానే పెరిగాయట. 2018నుంచి గౌతమ్ స్విమ్మింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొంటున్నట్లు నమ్రత తెలిపింది.

బటర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, బ్రేస్ట్ స్ట్రోక్, ఫ్రీ స్టైల్ ఇలా అన్నివిధాలుగా గౌతమ్ స్విమ్ చేయగలడట. నమ్రత రివీల్ చేసిన ఈ న్యూస్ తో మహేష్ అభిమానులంతా గౌతమ్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు.

More News

సౌత్ ప్రొడ్యూసర్ ఒక రాత్రి తనతో గడపమన్నాడు: సీనియర్ హీరోయిన్

రెండేళ్ల క్రితం అటు బాలీవుడ్, టాలీవుడ్ లో మీటూ, కాస్టింగ్ కౌచ్ సంఘటనలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

బ్రేకింగ్: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ గా సత్య నాదెళ్ల.. శిఖరాగ్రాన తెలుగు తేజం!

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల 2014లో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెసిందే.

కష్టాన్ని భరిస్తున్న విశాల్.. బాటిళ్లతో దాడి, ఒళ్ళు గగుర్పొడిచే వీడియో వైరల్!

హీరో విశాల్ కు తమిళంతో ఎంత అనుబంధం ఉందో తెలుగుతో కూడా అంతే బంధం ఉంది.

నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం.. కొడుకు మృతి, భర్త ఆరోగ్యం కూడా..

ప్రముఖ సీనియర్ నటి కవిత కుటుంబంలో తీవ్ర విషాదం ఎదురైంది.

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో 'అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.