సితార కోసం మ‌హేశ్ పాట‌!!

  • IndiaGlitz, [Saturday,May 16 2020]

క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల నెల‌కున్న లాక్‌డౌన్ కార‌ణంగా సినీ సెల‌బ్రిటీలంద‌రూ ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు. అంద‌రూ కుటుంబ స‌భ్యుల‌తో వారి విలువైన స‌మ‌యాన్ని గడుపుతున్నారు. దాంతో పాటు వారికి న‌చ్చిన ప‌నుల‌ను చేస్తున్నారు. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ విష‌యానికి వ‌స్తే సాధార‌ణ ప‌రిస్థితుల్లోనే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తుంటారాయ‌న‌. మ‌రిప్పుడు క్వారంటైన్ టైమ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న స‌మ‌యాన్నంతా పిల్ల‌ల‌తోనే గ‌డుపుతున్నారు మ‌హేశ్‌. త‌న‌యుడు గౌత‌మ్‌, కుమార్తె సితార‌ల‌తో ఆట‌లాడుకుంటున్నారు. అల్ల‌రి చేస్తున్నారు.

క్వారంటైన్ టైమ్‌లో మ‌హేశ్ పిల్ల‌ల‌తో ఎలా స‌మ‌యాన్ని గ‌డుపుతున్నార‌నే విష‌యాన్ని న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేస్తూనే ఉన్నారు. స‌ద‌రు ఫొటోల‌ను ఆమె త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా న‌మ్ర‌త మ‌హేశ్‌,సితార‌కు సంబంధించిన పోస్ట్ చేసిన పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర్ అవుతున్నాయి. తాజాగా సితార కోసం మహేశ్ పాట పాడారు. ఆ వీడియోను న‌మ్ర‌తా శిరోద్క‌ర్ పోస్ట్ చేశారు. టెడ్డీబేర్‌తో మ‌హేశ్ పాట పాడుతూ సితార‌ను న‌వ్విస్తుండటం విశేషం.

మ‌రో ప‌క్క మ‌హేశ్ త‌న 27వ సినిమాను ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నాడ‌ని కృష్ణ పుట్టిన‌రోజు మే 31 సంద‌ర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేస్తార‌ని అంటున్నారు.

More News

కష్టకాలంలో మంచి మనసు చాటుకున్న 'స్టార్ మా'

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ నడుస్తు్న్న విషయం విదితమే. దీంతో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.

ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు.. 101 మంది డిశ్చార్జ్

ఆంధ్రప్రదేశ్‌ కరోనా థాటి నుంచి కాస్త కోలుకున్నట్లే అనిపిస్తోంది. మునుపటితో పోలిస్తే.. వారంరోజులుగా నమోదైన కేసులు చాలా కుదుటపడుతోందనే చెప్పుకోవచ్చు.

టాలీవుడ్ షూటింగ్స్, షోలు ప్రారంభమైతే ఇలా చేయాల్సిందే!

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ మొదలుకుని బాలీవుడ్, హాలీవుడ్ వరకూ ఎక్కడా సినిమా షూటింగ్స్ జరగట్లేదు. అంతేకాదు.. థియేటర్స్, సినిమా రిలీజ్‌లు కూడా జరగట్లేదు..

నువ్ ఎవడివి నన్ను అడగడానికి.. అనసూయ ఆగ్రహం!

జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగామ్‌తో పాపులారిటీ సంపాదించుకున్న యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పుట్టిన‌రోజు నేడు(మే 15). ఈ సంద‌ర్భంగా అన‌సూయ కీస‌ర మండ‌లంలోని ప‌లువురు గ‌ర్భిణీల‌కు న్యూటిష‌న్

యంగ్ డైరెక్టర్ దుర్మరణం.. విషాదంలో శంకర్!

సినిమా ఇండస్ట్రీని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి భయం.. మరోవైపు ఇలా వరుస విషాదాలతో ఇండస్ట్రీ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే పలువురు