close
Choose your channels

అలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది: మహేష్ బాబు

Tuesday, April 7, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అలాంటి వారికి దూరంగా ఉంటే మంచిది: మహేష్ బాబు

ఈరోజు వ‌ర‌ల్డ్ హెల్త్ డే.. ప్ర‌పంచ‌మంతా క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు గ‌జ‌గ‌జ వ‌ణుకుతోంది. ఈ మ‌హ‌మ్మారిని త‌రిమేయ‌డానికి దేశ‌మంతా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను విధించారు. అయితే ఈలోపు ప్ర‌పంచంలోని ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడ‌టానికి డాక్ట‌ర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు అహ‌ర్నిశ‌లు శ్ర‌మ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌ర‌ల్డ్ హెల్త్ డే సంద‌ర్భంగా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశిస్తూ ట్వీట్స్ చేశాడు.

‘‘రెండు వారాల లాక్‌డౌన్ పూర్త‌య్యింది. మ‌నం విజ‌య‌వంతంగా పూర్తి చేశాం. మ‌నం చాలా బ‌లంగా ఉన్నాం. మ‌న ప్ర‌భుత్వాలు సంయుక్తంగా తీసుకున్న నిర్ణ‌యాల‌ను అభినందిస్తున్నాను. ఈ వ‌రల్డ్ హెల్త్ డే సంద‌ర్భంగా క‌రోనా వైర‌స్‌పై పోరాటానికి ముందుండి పోరాడుతున్న డాక్ట‌ర్స్‌కు అభినంద‌న‌లు. సామాజికి దూరం పాటించ‌డం ఎంత ముఖ్య‌మో మ‌రో విష‌యంలో కూడా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం అంతే ముఖ్యం. ఫేక్ న్యూస్‌ను క్రియేట్ చేస్తున్న వ్య‌క్తుల‌కు దూరంగా ఉండాల‌ని ఈ సంద‌ర్భంగా సూచిస్తున్నాను. ఇలా మ‌నల్ని మిస్ గైడ్ చేసే వ్య‌క్తుల‌కు దూరంగా ఉండ‌టం మంచిదే’’ అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.