సూపర్‌స్టార్ మహేశ్ సోదరుడు రమేశ్ బాబు కన్నుమూత

  • IndiaGlitz, [Saturday,January 08 2022]

టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మహేశ్‌ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్‌బాబు కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

దీంతో కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేశ్‌బాబు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రమేశ్‌బాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రెండేళ్ల క్రితం కృష్ణ సతీమణి విజయ నిర్మల గుండెపోటుతో మరణించారు. తాజాగా రమేశ్ మరణంతో సూపర్‌స్టార్ కుప్పకూలిపోయారు.

More News

కాలేజ్, లవ్ బ్యాక్‌డ్రాప్‌లో రౌడీ బాయ్స్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి పెద్ద సినిమాల విడుదలు వాయిదా పడటంతో ఈ సంక్రాంతికి అన్నీ చిన్న సినిమాలే హల్ చల్ చేయబోతున్నాయి.

రూ.100 కోట్ల ఆఫర్ తిరస్కరణ.. థియేటర్‌లోనే సుదీప్ ‘‘విక్రాంత్ రోణా’’

క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు సుదీప్.

సినిమాలను నియంత్రించినట్లు.. వీటిని కంట్రోల్ చేయగలారా: ఆర్జీవీ మరో వివాదాస్పద ట్వీట్

ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు వ్యవహారం పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే.

బెజవాడలో తెలంగాణ కుటుంబం ఆత్మహత్య.. సత్రంలో తల్లీకొడుకు, కృష్ణానదిలో దూకి తండ్రీకొడుకు

ఇటీవల కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్ చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

గుర్తుపట్టలేనంతంగా మారిపోయా.. మైండ్ బ్లాంక్ అయ్యింది: కోవిడ్ అనుభవాలు పంచుకున్న దీపికా

దేశంలో మొదటి, రెండో దశ కోవిడ్ వ్యాప్తి సమయంలో లక్షలాది మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో పలువురు సెలబ్రెటీలు సైతం వున్నారు.