హాలీవుడ్‌ సినిమాకు డబ్బింగ్‌ చెప్పనున్న మహేశ్‌ కుమార్తె

  • IndiaGlitz, [Monday,November 11 2019]

సూపర్‌స్టార్‌ మహేశ్‌ కుమార్తె సితార ఓ హాలీవుడ్‌ మూవీకి డబ్బింగ్‌ చెప్పనుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు మహేశ్‌ కుమారుడు గౌతమ్‌ వెండితెరపై కనిపించి అలరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సితార వెండితెరపై తన గొంతుతో ప్రేక్షకులను అలరించనుంది.

వివరాల్లోకెళ్తే..హాలీవుడ సంస్థ వాల్‌ డిస్నీ యానిమేషన్‌ స్టూడియోస్‌ నిర్మించిన చిత్రం ‘ఫ్రోజెన్‌ 2’ నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమాను హాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషల్లోనూ అనువాదం చేయిస్తున్నారు. అందులో భాగంగా తెలుగులో ఎల్సా పాత్రకు హీరోయిన్‌ నిత్యామీనన్‌ తెలుగులో డబ్బింగ్‌ చెప్పనుంది. అయితే మరి చిన్నప్పటి ఎల్సా పాత్రకు సితార డబ్బింగ్‌ను చెప్పబోతున్నారు. ‘డిస్నీ కుటుంబానికి నీకు స్వాగతం ఎల్సా’ అంటూ వాల్‌ డిస్నీ స్టూడియోస్‌ మెసేజ్‌ను పోస్ట్‌ చేసింది.

ఫ్రోజెన్‌ మూవీ నవంబర్‌ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. క్రిస్‌ బస్‌, జెన్నీఫర్‌ లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హిందీ ఎలా పాత్రకు ప్రియాంక చోప్రా, రాజకుమారి అన్నా పాత్రకు పరిణీతి చోప్రా డబ్బింగ్‌ చెప్పారు. ఇప్పుడు తెలుగులో సితారతో డబ్బింగ్‌ చెప్పిస్తుండటం అనేది సినిమాకు ఓ ప్లస్‌ పాయింట్‌ అనే చెప్పాలి. సినిమా పరిధిని తెలుగులో పెంచుకునే భాగంగా డిస్నీసంస్థ తెలివిగా వ్యవహరించింది.

More News

డిసెంబర్ 6 న 'బ్యూటిఫుల్' విడుదల

రాంగోపాల్ వర్మకు చెందిన టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందిన తాజా చిత్రం బ్యూటిఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక).

'చీమ - ప్రేమ మధ్యలో భామ!' డిసెంబర్  విడుదల

మాగ్నమ్ ఓపస్  (Magnum Opus ) పతాకం పై మిస్టర్ ఇండియా, మిస్ తెలంగాణ అభ్యర్థులు అమిత్, ఇందు ప్రధాన పాత్రలలో శ్రీకాంత్ "శ్రీ" అప్పలరాజు దర్శకత్వం లో

‘పవన్.. మీ ముగ్గురు భార్యల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు?’

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన ప్రవేశపెడుతున్న సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

కాచిగూడలో రెండు రైళ్లు ఢీ.. తప్పిన పెనుప్రమాదం

హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఆగివున్న పాసింజర్ రైలును ఎంఎంటీఎస్ ఢీకొన్నది.

ట్రంప్‌‌కు ఊహించని ఝలక్‌.. ఇండియన్స్‌కు తియ్యటి శుభవార్త

హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఉద్యోగావకాశాన్ని కల్పిస్తూ ఒబమా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనను ట్రంప్ రద్దుచేసిన సంగతి తెలిసిందే.