అప్ప‌టి నుంచి మ‌హేష్ కి బిగ్ ఫ్యాన్ అంటున్న రోహిత్ హీరోయిన్

  • IndiaGlitz, [Thursday,March 10 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి బిగ్ ఫ్యాన్ అంటున్న రోహిత్ హీరోయిన్ ఎవ‌రో కాదు...ల‌తా హేగ్డే. అవును...తుంట‌రి చిత్రంలో నారా రోహిత్ స‌ర‌స‌న ల‌తా హేగ్డే న‌టించింది. ఈమె పుట్టింది బెంగుళూరులో...పెరిగింది న్యూజిలాండ్ లో. అయితే చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే బాగా ఇష్టం.

సినిమాల్లో న‌టించ‌డం కోసం ముందుగా మోడ‌లింగ్ లో ఎంట్రీ ఇచ్చింద‌ట‌. సౌత్ సినిమాల్లో న‌టించాల‌నుకుంద‌ట‌. స‌రిగ్గా అలాంటి స‌మ‌యంలోనే న్యూజిలాండ్ లో మ‌హేష్ న‌టించిన ఆగ‌డు సినిమా చూసింద‌ట‌. అంతే...మ‌హేష్ తెగ న‌చ్చేసాడ‌ట‌. అప్ప‌టి నుంచి మ‌హేష్ కి బిగ్ ఫ్యాన్ అయిపోయాను అంటుంది. అదీ సంగ‌తి.