అమీర్ పేటలో మహేష్..

  • IndiaGlitz, [Saturday,July 30 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం నిన్న అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైన విష‌యం తెల‌సిందే. ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ఈరోజు నుంచి ప్రారంభ‌మ‌య్యే ఫ‌స్ట్ షెడ్యూల్ ఆగ‌ష్టు 13 వ‌ర‌కు జ‌రుగుతుంది.
ఇదిలా ఉంటే...మ‌హేష్ ఆగ‌ష్టు 1 నుంచి షూటింగ్ లో పాల్గొంటాడు అని ప్ర‌చారం జ‌రిగింది కానీ...తాజా స‌మాచారం ప్ర‌కారం ఈరోజు నుంచి మ‌హేష్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈరోజు అమీర్ పేట లోని జెన్టిక్స్ లో మ‌హేష్ పై కొన్ని సీన్స్ చిత్రీక‌రిస్తున్నారు. ఈ చిత్రంలో మ‌హేష్ ఇంటిలిజెన్స్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నారు. ఈ మూవీ కోసం అన్న‌పూర్ణ స్టూడియోలో భారీ సెట్ రెడీ చేసారు. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో డైరెక్ట‌ర్ ఎస్.జె.సూర్య విల‌న్ గా న‌టిస్తుండ‌డం విశేషం.

More News

100 రోజులు పూర్తి చేసుకున్న 'సరైనోడు'

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో గీతాఆర్ట్స్ బ్యానర్పై రూపొందిన చిత్రం సరైనోడు చిత్రం 100రోజలును పూర్తి చేసుకుంది.

టైటిల్ కన్ ఫర్మ్ చేసిన నిర్మాత...

ఎనర్జిటిక్ స్టార్ రామ్,సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

చిరు మూవీలో నటించే హీరోయిన్ డీటైల్స్..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో నటించే హీరోయిన్ ఎవరు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

అఖిల్ మూవీ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు..

అక్కినేని అఖిల్ రెండో సినిమాను అందాల రాక్షసి,కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడితో చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

నాయనా..రామ్ చరణ్ ఏమిటి ఈ కన్ ఫ్యూజన్..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.