'క్షణం' థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసిన సూపర్ స్టార్ మహేష్, సమంత

  • IndiaGlitz, [Wednesday,February 10 2016]

టాలీవుడ్ నిర్మాణ రంగంలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్ రియలిస్టిక్ కాన్సెప్ట్ మూవీస్ నిర్మించే దిశగా అడుగులు వేస్తుంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ తో కలిసి నిర్మిస్తున్న సస్పెన్స్ డ్రామా క్షణం'. అడవిశేష్,ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో కనపడుతుంది. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు. ఈసినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్, సమంతల విడుదల చేశారు.

రొమాంటిక్ సీట్ ఎడ్జింగ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ను చూసిన మహేష్ బాబు, సమంత యూనిట్ సభ్యులను అభినందించారు.

రవికాంత్ పేరెపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అడవి శేష్ కథను అందించారు. సినిమాను మార్చి 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అడవిశేష్, ఆదాశర్మ, అనసూయ భరద్వాజ, సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవివర్మ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి స్టోరీ: అడవి శేష్, ఎడిటింగ్: అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరెపు, స్క్రీన్ ప్లే: రవికాంత్ పేరెపు,అడవి శేష్, సాహిత్యం: సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, డైలాగ్స్, స్క్రిప్ట్ గైడెన్స్: అబ్బూరి రవి, నిర్మాత: పరమ్ వి.పొట్లూరి, కెవిన్, అన్నె, దర్శకత్వం: రవికాంత్ పేరెపు.

More News

సెంటిమెంట్ న‌మ్ముకున్న ఆది

యువ హీరో ఆది న‌టించిన తాజా చిత్రం గ‌రం. ఈ చిత్రాన్ని పెళ్లైన కొత్త‌లో...ఫేం మ‌ద‌న్ తెర‌కెక్కించారు.

బాహుబలి 2 రిలీజ్ డేట్ అంటూ బాలీవుడ్ ప్రచారం...

దర్శకథీర రాజమౌళి బాహుబలి సినిమాతో ఎంతటి సంచలనం సృష్టించారో తెలిసిందే.ఇప్పుడు బాహుబలిని మించి సక్సెస్ సాధించేలా బాహుబలి 2 తెరకెక్కిస్తున్నారు.

ప్రభాస్ కోసం ట్రై చేస్తున్న ప్లాప్ డైరెక్టర్...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2 మూవీ చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేయనున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దదే ఉంది.

ఖ‌చ్చితంగా ఆయ‌న‌తో సినిమా చేస్తానంటున్న నాని

యువ హీరో నాని ఖ‌చ్చితంగా సినిమా చేస్తానంటున్నాడు ఎవ‌రితో అనుకుంటున్నారా...?  భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన మ‌ణిర‌త్నంతో..ఇటీవ‌ల మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన చిత్రం ఓకె బంగారం.

అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆకాష్ పూరి..

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి.