Yatra 2:"నేను విన్నాను, నేను ఉన్నాను" : యాత్ర 2 మోషన్ పోస్టర్ రిలీజ్ .. జగన్ జైత్రయాత్ర చూడబోతున్నామా


Send us your feedback to audioarticles@vaarta.com


2019 ఎన్నికల సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి ఇందులో వైఎస్సార్ పాత్రను పోషించగా.. మహీ వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సమయంలోనే యాత్రకు సీక్వెల్ కూడా వుంటుందని ఆయన ప్రకటించారు. తాజాగా ఇవాళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ‘‘యాత్ర 2’’ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఒక నిమిషం పాటు వున్న ఈ పోస్టర్‌లో వైఎస్సార్ చెప్పే.. ‘‘నమస్తే బాబు.. నమస్తే అక్కయ్య.. నమస్తే చెల్లెమ్మా, నమస్తే, నమస్తే’’ అంటూ మోషన్ పోస్టర్ ప్రారంభమవుతుంది. యానిమేషన్ ఫార్మాట్‌లో వున్న జగన్ నడుస్తూ వుంటే బ్యాక్ గ్రౌండ్‌లో వాయిస్ వస్తుంది. ‘‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. నేను విన్నాను, నేను వున్నాను’’ అంటూ వైఎస్ జగన్ వాయిస్ ఓవర్‌తో వీడియో ముగుస్తుంది.
వైసీపీ ఆవిర్భావం, వైఎస్ జగన్ పాదయాత్ర, 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టే అంశాలు యాత్ర 2లో వుండనున్నాయి. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చనున్నారు. 2024 ఫిబ్రవరిలో యాత్ర 2 సినిమాను రిలీజ్ చేయనున్నారు. అయితే ఇందులో జగన్ రోల్‌ను ఎవరు పోషిస్తారన్నది మాత్రం తెలియరాలేదు. సూర్య, దుల్కర్ సల్మాన్‌ల పేర్లు బలంగా వినిపించినప్పటికీ.. ప్రస్తుతం మాత్రం తమిళ హీరో జీవా పేరు వార్తల్లో బాగా నానుతోంది.
కరోనా సమయంలో మహి వి రాఘవ్ యాత్ర 2 స్క్రిప్ట్‌పై పనిచేసినట్లుగా తెలుస్తోంది. ఇదే టైంలో సేవ్ ది టైగర్స్, సైతాన్ వెబ్ సిరీస్‌లు తెరకెక్కించారు. అ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా యాత్ర 2 ద్వారా ఆయన ఎన్ని సంచలనాలు నమోదు చేస్తారో చూడాలి. అన్నట్లు ఈ సినిమాను వీ సెల్యూలాయిడ్స్, త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com