close
Choose your channels

మహిళా కబడ్డీ మూవీ పోస్టర్ లాంచ్...

Saturday, May 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మహిళా కబడ్డీ మూవీ పోస్టర్ లాంచ్...

ఆర్  కె ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రచనా స్మిత్ , కావ్య రెడ్డి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం మహిళా కబడ్డీ. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ శనివారం దర్శక నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ పుట్టినరోజు సందర్బంగా తెలంగాణ ఫిలిం కల్చరల్ సెంటర్ లో జరిగింది. పోస్టర్ ని తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్స్ చైర్మన్ బాలమల్లు విడుదల చేసారు.ఈ కార్యక్రమంలో లయన్ విజయ్ కుమార్, ఆలీ ఖాన్, మాజీ హీరోయిన్ రంజని, స్నిగ్ద తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ముఖ్య అతిథి బాలమల్లు మాట్లాడుతూ ఆర్ కె గౌడ్ చాలా కాలంగా నాకు మంచి మిత్రుడు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. దర్శక నిర్మాతగా అయన తెరకెక్కిస్తున్న మహిళా కబడ్డీ పాటలు ఇటీవలే విన్నాను. చాలా బాగున్నాయి. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని చాటిచెప్పే సినిమా ఇది. తప్పకుండా మహిళా కాబట్డ్ది మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. 

దర్శక నిర్మాత రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ .. మహిళా కబడ్డీ పేరుతొ తెరకెక్కిస్తున్న సినిమాకు సంబందించిన పాటల రికార్డింగ్ పూర్తయింది. గీతా మాధురి, మంగ్లీ, మధుప్రియ లాంటి ప్రముఖ గాయనీమణులు పాడిన ఆరు పాటలను రికార్డింగ్ చేసాం. దాంతో పాటు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. జూన్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నాం.

ఓ సాధారణ పల్లెటూరి అమ్మాయి కబడ్డీలో జాతీయ స్థాయిలో ఎలా నిలిచింది. ఆమె జర్నీలో ఉన్న సమస్యలు, మలుపులు ఏమిటి అన్న ఆసక్తికర అంశాలతో ఈ సినిమా ఉంటుంది. రచన స్మిత్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను త్వరలోనే పూర్తీ చేసి విడుదల చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తదితరులు రామకృష్ణ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  

ఈ చిత్రానికి సంగీతం రాజ్ కిరణ్, నిర్మాత, దర్శకత్వం ; ప్రతాని రామకృష్ణా గౌడ్. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.