హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నవంబర్ 27న 'మైదాన్'

  • IndiaGlitz, [Thursday,January 30 2020]

ప్రపంచంలో అత్యధిక మంది ఆదరించే ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'మైదాన్'. భారత దేశాన్ని ఫుట్ బాల్ రంగంలో ప్రపంచ పటంలో నిలిపిన ఒక కోచ్ నిజ జీవిత కథ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. జీవితంలో అయినా, ఆటలో నైనా ఆత్మ విశ్వాసం, కష్టపడే తత్వంతో పాటు ఎన్నో త్యాగాలు చేస్తేనే విజయం వరిస్తుంది. క్రీడా నేపథ్యంలో స్ఫూర్తిమంతమైన కథగా మైదాన్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేశారు. 'బధాయి హో' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కోల్ కత్తా, లక్నో, ముంబై నగరాల్లో 50 రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఏప్రిల్ కి చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది.

నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, 'బధాయి హో' ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న'మైదాన్' చిత్రాన్ని జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను సైవిన్ కాద్రస్, రితేష్ షా అందిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మైదాన్ నవంబర్ 27, 2020న విడుదల అవుతోంది.

More News

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్’ సిస్టమ్

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు సాంకేతికతను విరివిగా ఉపయోగిస్తున్నారు. నిత్యం వందలాది మంది ప్రయాణించే ఈ ఎయిర్‌పోర్టులో లగేజ్ విషయంలో

RRRలో ఆలియా భట్ కోసం ప్ర‌త్యేక గీతం

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’. డి.వి.వి.దాన‌య్య నిర్మాత‌.

కాళోజీ నారాయణ రావు బయోపిక్ షూటింగ్ ప్రారంభం

"ప్రజాకవి-కాళోజీ" సినిమాను "జైనీ క్రియేషన్స్" బ్యానర్ పై శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మిస్తున్నారు.

'ఆనంద భైరవి' యాభై శాతం పూర్తి...

M.V.V. సత్యనారాయణ (వైజాగ్ ఎంపీ) సమర్పణలో అంజలి, లక్ష్మీరాయ్, అధిత్ అరుణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం "ఆనంద భైరవి"

మహేష్ బాబు సినిమాలో మరో క్రేజీ స్టార్?

రీసెంట్ గా 'సరిలేరు నీకెవ్వరు'తో సందడి చేసిన మహేశ్ బాబు... తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో చేయబోతున్న సంగతి తెలిసిందే.