బాలయ్య-బోయపాటి సినిమా నుంచి ప్రముఖ టెక్నీషియన్ ఔట్

బాలయ్య-బోయపాటి సినిమాకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. మొదట బడ్జెట్ .. ఆ తర్వాత రెమ్యునరేషన్ గొడవ.. ఆపై స్క్రిప్ట్ వర్క్.. ఇలా ప్రతీది ఈ సినిమాకు ఆటంకంగా మారింది. ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ తప్పుకున్నారట. ఈయన బాలయ్య తాజా డిజాస్టర్ ‘రూలర్’ సినిమాకు కూడా పని చేశారు. అంతకు ముందు మరికొన్ని సినిమాలకు పని చేశాడు. విచిత్రం ఏంటంటే.. ‘రూలర్’ విడుదల సమయంలో రామ్ ప్రసాద్‌ను బాలయ్య ఆకాశానికెత్తాడు. కానీ ఇప్పుడు అదే బాలయ్య సినిమా నుంచి ఆయన వెళ్లిపోయాడు.

అంతర్గత సమాచారం ప్రకారం.. ఆయనను తప్పించమని నిర్మాతలను బాలయ్యే కోరారట. సెంటిమెంట్లను బాగా నమ్మే ఈ నందమూరి నటసింహం.. వరుస ప్లాపులతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఏమాత్రం పసలేని కథతో రూలర్ తీసి.. తొలిరోజే పని అయిపోయిందన్న టాక్ తెప్పించుకున్నాడు. దీంతో మళ్లీ బోయపాటినే నమ్ముకున్న బాలయ్య.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. దానికోసం భారీగానే కసరత్తులు చేస్తోంది ఈ చిత్రబృందం. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు.

More News

‘సరస’ సంభాషణ ఎఫెక్ట్.. చైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా

టాలీవుడ్ ప్రముఖ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్‌కు.. మహిళా ఉద్యోగినికి సరస సంభాషణ చేస్తున్నట్లు ఓ ఆడియో నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

శర్వానంద్ విడుదల చేసిన P3 పటారుపాలెం ప్రేమ కథ థర్డ్ సాంగ్

జె.ఎస్ ఫిలిమ్స్ పతాకం పై దొరైరాజు వూపాటి  దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "పటారుపాళెం ప్రేమ కథ" శ్రీ మానస్, సమ్మోహన హీరో హీరోయిన్ లుగా

కనుల పండుగగా జీ సినీ అవార్డ్స్ తెలుగు 2020 ని జరుపుకున్న జీ తెలుగు

నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌ అడ్రస్ జీ తెలుగు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన జీ తెలుగు… ఇప్పుడు మరోసారి జీ సినీ అవార్డ్స్ తెలుగు 2020 తో

'భీష్మ' టీజర్ విడుదల

నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం 'భీష్మ'.

ఆ ఒక్కటి చేస్తే బాలయ్య కూడా వైసీపీలోకే జంప్!?

అవును.. మీరు వింటున్నది నిజమే.. ఈ మాట అన్నది ఎవరో కాదండోయ్ స్వయానా వైసీపీ మంత్రి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. వాస్తవానికి ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వచ్చే నేతలు కచ్చితంగా వారి పదవులకు రాజీనామా