close
Choose your channels

అల‌నాటి హీరోయిన్‌గా మాళ‌విక‌

Thursday, November 15, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల‌నాటి హీరోయిన్‌గా మాళ‌విక‌

ఎన్టీఆర్ బ‌యోపిక్ `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు`, `య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు` అనే రెండు భాగాలుగా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. పార్ట్ వ‌న్ విష‌యానికి వ‌స్తే ఇందులో ఎన్టీఆర్ జీవితంలో సినిమాల్లో ఆయ‌న అగ్ర క‌థానాయ‌కుడిగా ఎదిగిన వైనాన్ని చూపించ‌నున్నారు. ఇందులో చాలా మంది తార‌లు క‌నిపిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, షాలిని పాండే, అనుష్క త‌దిత‌రులు ఎన్టీఆర్ న‌టించిన అల‌నాటి హీరోయిన్స్ పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

కాగా.. ఎన్టీఆర్‌తో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ కృష్ణ‌కుమారి పాత్ర‌ను య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడులో చిత్రీక‌రించ‌బోతున్నారు. కృష్ణ‌కుమారి పాత్ర‌లో మాళ‌వికా నాయ‌ర్ న‌టించ‌నున్నార‌ట‌. అప్ప‌ట్లో ఎన్టీఆర్‌, కృష్ణ‌కుమారి మ‌ధ్య రిలేష‌న్ ఉంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఎలాంటి రిలేష‌న్ గురించి చ‌ర్చించ‌కుండా వలం వారు న‌టించిన సినిమాల్లో పాట‌ల‌ను మాత్ర‌మే చిత్రీక‌రిస్తున్నార‌ట. య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.