నరేష్ తో మలయాళ హీరోయిన్

  • IndiaGlitz, [Friday,March 10 2017]

అల్ల‌రి న‌రేష్ హిట్ కోసం చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. వివిధ ర‌కాలైన సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. ప్ర‌స్తుతం న‌రేష్ హీరోగా 'వ‌డ‌క్క‌న్ సెల్ళీ' అనే మ‌ల‌యాళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి సన్నాహాలు మొద‌లు పెట్టారు. నిజానికి ఈ రీమేక్‌ను అలా ఎలా ఫేమ్ అనీష్ కృష్ణ డైరెక్ట్ చేయాల్సింది కానీ..కొన్ని కార‌ణాల‌తో అనీష్ కృష్ణ స్థానంలో మ‌ల‌యాళ సినిమాను డైరెక్ట్ చేసిన ప్ర‌జీత్ క‌ర‌ణ్‌వ‌ర్ మెగా ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తున్నారు.

బోప‌న్న చంద్ర‌శేఖ‌ర్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 16 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మల‌యాళ భామ నిఖిల విమ‌ల న‌టిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ల‌యాళం, త‌మిళ సినిమాల్లోనే న‌టించిన నిఖిల‌కు తెలుగులో ఇదే తొలి చిత్రం. అవ‌స‌రాల శ్రీనివాస్‌, హైప‌ర్ ఆది కూడా కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు

More News

భావన ఎంగేజ్ మెంట్...

రీసెంట్గా కిడ్నాప్న్కు గురైన మలయాళ హీరోయిన్ భావనకు ఎంగేజ్ మెంట్ అయ్యింది. రీసెంట్గా భావనను ఆమె మాజీ కారు డ్రైవర్ సహా కొందరు దుండగులు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం చాలా పెద్ద దుమారం రేపింది.

'మిక్చర్ పొట్లం' ఆడియో సక్సెస్ మీట్

జయంత్, శ్వేతా బసు ప్రసాద్, గీతాజంలి హీరో, హీరోయిన్లగా నటిస్తోన్న చిత్రం `మిక్చర్ పొట్లం`. సతీష్ కుమార్ ఎం.వి దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి సినీ టోన్ పతాకంపై లయన్ కలపటపు శ్రీ లక్ష్మి ప్రసాద్, కంటె వీరన్న చౌదరి, లంకల పల్లి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కామెడీ హారర్ తో 'టిక్ టాక్'

గతంలో 'హోప్', 'చంద్రహాస్' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన నటుడు, నిర్మాత, దర్శకుడు పోలిచర్ల హరనాధ్ తాజాగా నటిస్తూ దర్శకనిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం 'టిక్ టాక్'.

ప్రారంభమైన 'శిఖండి' షూటింగ్

శ్రీ చర్ల మూవీస్ పతాకం పై చర్ల శ్రీనివాస్ యాదవ్ నిర్మిస్తోన్న చిత్రం “శిఖండి”. పి.రాజారెడ్డి ఈ సినిమాతో దర్శకునిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు.

డబ్బింగ్ మొదలుపెట్టిన 'ఏంజెల్'

బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ టైటిల్ రోల్ లో తెరకెక్కుతోన్న సినిమా “ఏంజిల్”. యంగ్ హీరో నాగ అన్వేష్, ఓ ఛాలెజింగ్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంతో దర్శకధీరుడు రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు.