close
Choose your channels

ఆ మలయాళీ స్టార్ కపుల్.. తెలుగులో బిజీబిజీ

Thursday, April 22, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆ మలయాళీ స్టార్ కపుల్.. తెలుగులో బిజీబిజీ

తెలుగు సినిమాల్లో చేసేందుకు అన్ని ఇండస్ట్రీల వారూ చాలా ఇష్టపడుతుంటారు. తెలుగు ప్రేక్షకులు ఎవరినైనా సరే త్వరగా ఓన్ చేసుకుంటారు. వేరే ఇండస్ట్రీ వారికి ఇక్కడ అద్భుతమైన స్థానం ఉంటుంది. అందుకే నటీనటులు తెలుగు సినిమాలంటేనే ఎగిరి గంతేస్తారు. ప్రస్తుతం మలయాళీ స్టార్ హీరో ఆయన భార్య తెలుగులో తమ సినిమా షూటింగ్‌ల్లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఆ భార్యభర్తలు మరెవరో కాదు.. ఫహాద్ ఫాజిల్, నజ్రియా నజీమ్ దంపతులు. విలన్‌గా మెప్పించేందుకు ఫహాద్ సిద్ధమవుతుండగా.. నజ్రియా సైతం నేరుగా ఓ తెలుగు సినిమాలో నటించి మెప్పించేందుకు సిద్ధమవుతోంది.

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, వెర్సటైల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. ఈ పాన్ ఇండియా మూవీని వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌గా టాలీవుడ్‌లో పేరుగాంచిన ‌ మైత్రీ మూవీ మేకర్స్ మ‌రో నిర్మాణ సంస్థ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తోంది. ఈ చిత్రంలో విలన్‌గా మెప్పించేందుకు పహాద్ ఫాజిల్ సిద్ధమవుతున్నారు. ఫహాద్‌ మలయాళంలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఈయన నటనకు ఎన్నో అవార్డులు లభించాయి. అలాంటి ఫహాద్ తెలుగులో విలన్‌గా నటించేందుకు యాక్సెప్ట్ చేయడమే చాలా గొప్ప విషయం. అయితే ఈ మ‌ల‌యాళ విల‌క్ష‌ణ నటుడిని తమ సినిమాలో విల‌న్‌ పాత్రలో న‌టింప చేయ‌డానికి నిర్మాత‌లు భారీగానే ముట్ట‌చెప్పార‌ట‌. నిర్మాతలు ఫహాద్‌కు ఈ సినిమా కోసం రూ.5 కోట్లు ముట్టజెప్పారని టాక్. ఈ చిత్రంలో విలన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. దీంతో ఈ పాత్రకు ఫహాద్ అయితేనే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం.

ఇక పహాద్ భార్య నజ్రియా తెలుగు సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. గతంలో ‘రాజా రాణి’ అనే డబ్బింగ్ సినిమా ద్వారా తొలిసారి తెలుగు తెరపై ఈ ముద్దుగుమ్మ కనిపించింది. ఆ సినిమాలో నజ్రియాను చూసిన వారంతా ఫిదా అయిపోయారు. ఇప్పటికీ ఆమెను తెలుగు ప్రేక్షకులు మరచిపోలేరు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎప్పుడు నటిస్తుందా? అని ఎందరో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్లకు వారి కల నెరవేరింది. నేచురల్ స్టార్ నాని సరసన తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'అంటే సుందరానికీ' అనే సినిమాలో నాచురల్ స్టార్ నాని సరసన నజ్రియా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. లవ్‌ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'అంటే సుందరానికీ!' సినిమా రూపొందుతోంది. మొత్తానికి భార్యాభర్తలిద్దరూ తెలుగు సినిమాల షూటింగ్‌లతో హైదరాబాద్‌లో బిజీబిజీగా గడిపేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.