close
Choose your channels

ఎన్నికలకు ముందే మోదీపై గెలిచిన మమత!

Sunday, January 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రధాని పీఠం కన్నేసిన దీదీ.. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలన్నీ ఏకం చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఫస్ట్ టైం కోల్‌‌కతా వేదికగా 'యునైటెడ్ ఇండియా ర్యాలీ' పేరుతో దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీలన్నింటినీ రప్పించారు. ఈ ర్యాలీకి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రసంగించబోయే సభకు పెద్దగా జనాలు రారని ఆదిలోనే వీరికి ఎదురుదెబ్బ తగుల్తుందని కమలనాథులు అంతా భావించారు. అయితే ఆ అంచనాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. కనివీని ఎరుగని రీతిలో ర్యాలీలో.. సభకు లక్షలాదిగా కార్యకర్తలు తరలిరావడంతో దీదీ కళ్లలో ఆనందం కనపడింది. ఈ ర్యాలీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లగా.. కేసీఆర్‌‌కు ఆహ్వానం అందినా పెద్దగా పట్టించుకోలేదు.!

ఇక విషయానికొస్తే.. మోదీని రెండోసారి ప్రధాని కాకుండా.. 'థర్డ్ ఫ్రంట్', 'ప్రజా ఫ్రంట్', 'ఫెడరల్ ఫ్రంట్' అంటూ కొత్త కొత్త ఫ్రంట్‌‌లు వస్తున్నాయి. పైగా 2014-2018 వరకూ మోదీ మార్క్ దెబ్బతిన్నదని.. రెండోసారి ఆయనే మళ్లీ ప్రధాని అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఓ రహస్య సర్వేలో తేలినట్లు సమాచారం. దీంతో బీజేపీ వ్యూహాలు రచిస్తుండగా దీదీ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో పైన చెప్పబడిన భారీ ర్యాలీకి మమత శ్రీకారం చుట్టారు.

ఈ భారీ ర్యాలీకి 23 పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు, అధినేతలు హాజరయ్యారు. ముఖ్యంగా ఏ పార్టీలయితే బీజేపీని వ్యతిరేకిస్తున్నాయో వాటన్నింటినీ మున్ముంథు కలుపుకొని పోవడానికి దీదీ ప్రయత్నాలు చేస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "మోదీ సర్కారు 'ఎక్స్‌పైరీ డేట్‌'ను దాటేసింది. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మనం మళ్లీ ఇదే మైదానంలో కలుసుకుందాం" అంటూ ఈ సభా వేదికగా ఆమె పిలుపునిచ్చారు.

ఈ ర్యాలీకి, భారీ బహిరంగ సభకు కనివినీ ఎరుగని రీతిలో.. ఇసుకేస్తే రాలనంతగా జనాలు రావడం విశేషం. దీంతో ఎన్నికలకు వెళ్లకముందే మోదీపై దీదీ గెలిచిపోయారని మమతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మమత మొదటి స్టెప్ అదిరిపోయిందని మున్ముంథు ఇలాంటి ప్రయత్నాలు చేయడంలో ఏ మాత్రం వెనకడుగేయకుండా ముందుకెళ్తే కచ్చితంగా మంచిరోజులొచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే కీలక పార్టీలయిన అన్నింటినీ కలుపుకొని వెళ్తున్న మమతకు ఏ మాత్రం సహకరిస్తారు..? ప్రధాని కావాలనుకుంటున్న దీదీ కల నిజమవుతుందా లేకుంటే బెంగాల్ సీఎంకే పరిమితమవుతారో పార్లమెంట్ ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.