వైఎస్ఆర్‌ పాత్రలో మమ్ముట్టి

  • IndiaGlitz, [Wednesday,March 21 2018]

భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకి అందించిన 70ఎంఎం ఎంటర్టెన్మెంట్స్ బేనర్ పై నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న తృతియ చిత్రం యాత్ర. ఈ చిత్రానికి ఆనందో బ్రహ్మ ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగు ప్ర‌జ‌ల ఎమోష‌న‌ల్ ప్ర‌జానాయాకుడు మాజి ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర కథను దర్శకుడు మహి వి రాఘవ్ స్వయంగా రాసుకుని రూపొందిస్తున్నారని ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రను మమ్ముట్టి పోషించబోతున్నట్లుగా చిత్ర బృందం తెలిపింది.

ఈ సందర్భంగా నిర్మాత విజయ్ చిల్లా మాట్లాడుతూ ఆనందో బ్రహ్మతో తమ సంస్థకు ద్వితియ విజయాన్ని అందించిన మహి వి రాఘవ్ డైరెక్షన్ లో మరో సినిమాను నిర్మించడం చాలా ఆనందంగా ఉందని, యాత్ర కోసం మహి రెడీ చేసిన లైన్ నచ్చడంతో సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లుగా తెలిపారు విజయ్ చిల్లా.

అలానే తమ సినిమాలో ముఖ్య పాత్రయిన వైఎస్ఆర్ పాత్ర‌లో న‌టించ‌డానికి మమ్ముట్టి అంగీకరించడం చాలా ఆనందం క‌లిగింది. రెండు రాష్ట్రాల ప్రజలు ఆరాదించే నాయకుడు, ఎమోషనల్ గా ప్రజలకు దగ్గరైన వ్యక్తి వైయస్. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటన‌ల‌ ఆధారంగా భారీ బడ్జెట్ తో ఎమెష‌న‌ల్ కంటెంట్‌ గా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నామని. త్వరలోనే ఈ బయోపిక్ కి సంబంధించిన వివరాల్ని అధికారికంగా ప్రకట్టిస్తామని తెలిపారు.

More News

అక్కినేని తండ్రీకొడుకుల‌కు త‌ప్ప‌ని పోటీ

ఈ వేసవిలో త‌మ కొత్త చిత్రాల‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అక్కినేని కుటుంబానికి చెందిన తండ్రీ కొడుకులు నాగార్జున, నాగచైతన్య.

'మహానటి' ఎటువైపు..?

తెలుగువారి ఆరాధ్యనటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. నాగ ఆశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.

మార్చి 23న ప్ర‌పంచ వ్యాప్తంగా 'రాజరథం'

నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్‌ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం 'రాజరథం'.

'ఎం.ఎల్‌.ఎ' ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌కుండా మెప్పిస్తుంది - క‌ల్యాణ్ రామ్‌

నందమూరి కల్యాణ్‌ రామ్‌, కాజల్‌ అగర్వాల్‌ హీరో హీరోయిన్లుగా టి.జి.విశ్వప్రసాద్‌ సమర్పణలో బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌

గోపీచంద్ 'పంతం' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

'ఆంధ్రుడు', 'య‌జ్ఞం', 'లక్ష్యం', 'శౌర్యం', 'లౌక్యం' వంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్.