ఛత్తీస్‌గఢ్‌లో దారుణం... భుజాలపై కూతురి మృతదేహాన్ని 10 కిలోమీటర్లు మోసుకుంటూ

  • IndiaGlitz, [Saturday,March 26 2022]

పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే తమ ప్రధాన లక్ష్యమంటూ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, నేతలు ఊకదంపుడు ప్రసంగాలు ఇస్తూ వుంటారు. కానీ ఆచరణలో ఈ హామీని నిలబెట్టుకున్న దాఖలాలు చాలా తక్కువ. స్వతంత్ర భారతంలో ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా పేదలకు ఈ కనీస సౌకర్యాలు అందడం లేదన్నది బహిరంగ రహస్యమే. తాజాగా ఓ నిరుపేద తండ్రి అనారోగ్యంతో మరణించిన తన బిడ్డ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ లేకపోవడంతో.. తన భుజాలపైనే 10 కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకెళ్లాడు.

వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా అందాలా గ్రామానికి చెందిన ఈశ్వర్‌ దాస్‌ 7 ఏళ్ల కుమార్తె అనారోగ్యానికి గురైంది. కొద్ది రోజులుగా పాప తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో స్థానికంగా వున్న వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అయిన్పటికీ తగ్గకపోవడంతో శుక్రవారం లఖాన్‌పుర్‌లోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే చిన్నారి పరిస్థితి విషమించగా... ఆక్సిజన్‌ స్థాయిలు 60కి పడిపోయాయి. దీంతో వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం పాప కన్నుమూసింది.

అదే సమయంలో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్‌ అందుబాటులో లేదు. దీంతో ఈశ్వర్‌ దాస్ తన కుమార్తె మృతదేహాన్ని భుజాన మోసుకుని 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి నడుచుకుంటూ వెళ్లాడు. ఆ సమయంలో కొందరు తీసిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి టీఎస్‌ సింగ్ దేవ్ ఘటనపై విచారణకు ఆదేశించారు.

More News

కలెక్టర్ సిద్ధార్ధ్ రెడ్డి వచ్చేశారు... ఊర మాస్ లుక్‌లో నితిన్ ఫస్ట్‌లుక్

హిట్టూ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు తీసే హీరోల్లో నితిన్ కూడా ఒకరు. వరుసగా ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న ఆయన..

ఆర్ఆర్ఆర్ రిలీజ్ : తండ్రి మందలించాడని .. ఉరేసుకుని అభిమాని ఆత్మహత్య

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా ‘‘ఆర్ఆర్ఆర్’’ మ్యానియానే నడుస్తోంది.

బొమ్మ అదుర్స్.. ఆర్ఆర్ఆర్‌ని ఈ వారమే ఫ్యామిలీతో కలిసి చూస్తా: నారా లోకేష్

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ మూవీ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది.

అదో కళాఖండం .. మైండ్ బ్లోయింగ్, ఆర్ఆర్ఆర్‌పై చిరు రివ్యూ

దర్శక ధీరుడు  ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’

మున్సిపల్ సిబ్బంది నిర్వాకం.. పన్ను చెల్లించలేదని, ఇంటి ముందు చెత్త కుప్ప

ఇంటిపన్ను, నీటి పన్ను వంటి వాటిని వెంటనే చెల్లించాలంటూ నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు మైకుల ద్వారా అనౌన్స్‌ చేస్తుంటాయి. అంతేకాదు..