రోజంతా లేడీస్‌ హాస్టల్‌లో విద్యార్థి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో..!

  • IndiaGlitz, [Saturday,February 22 2020]

విద్యార్థినీలు ఉన్న హాస్టల్‌లోకి బాయ్స్‌కు అనుమతి ఉండదన్న విషయం తెలిసిందే. అయితే.. అబ్బే ఈ షరతులు అందరికీ వర్తిస్తాయ్ కానీ నాకు కాదు అనుకున్నాడేమో కానీ.. గట్టి ప్లానేసి మరీ హాస్టల్‌లోకి వెళ్లాడు. అది కూడా తన ప్రియురాలు ఉండే గది కిటికీ తీసేసి మరీ లోనికి వెళ్లాడు. అంతేకాదండోయ్.. ప్రియురాలి స్నేహితులు కూడా ఈ కుర్రాడికి సహకరించారు. అలా ఒకట్రెండు కాదు.. 24 గంటల పాటు ప్రియురాలితో రూమ్‌లోనే గడిపాడు తీరా చూస్తే.. సీన్ రివర్స్ అయ్యింది రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. గల్లాపట్టి లాక్కుని మరీ బయటికి లాక్కొచ్చారు. ఈ ఘటన జరిగింది మరెక్కడో కాదండోయ్ ఏపీలోని కృష్ణా జిల్లా.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో..! వారం రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడటంతో మీడియా వాళ్లు ఓ రేంజ్‌లో కథనాలు అల్లేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది..? ఎలా దొరికిపోయారనే విషయం ఇప్పుడు చూద్దాం.

జరిగిందిదీ..!
కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ చదువుతున్న విద్యార్థినితో యువకుడికి పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.. అది కాస్త లేడీస్ హాస్టల్‌దాకా వెళ్లింది.. తీరా చూస్తే వీరిద్దరితో పాటు మరో నలుగురు సస్పెండ్ అయ్యారు. ప్రేమించుకున్నారు.. కలవాలనుకున్నారు.. బయట తిరిగితే ఎవరికైనా తెలుస్తుందేమో అనుకున్నారో లేకుంటే.. క్యాంపస్‌లో ‘ఫెస్ట్ కార్యక్రమం’ జరుగుతుండటంతో ఇక మనల్ని పట్టించుకునేదెవరులే అనుకున్నారేమో కానీ.. ఏకంగా అమ్మాయిండే లేడీస్ హాస్టల్‌నే స్పాట్‌గా పెట్టుకున్నారు. దొంగతనంగా లేడీస్ హాస్టల్‌లోకి వెళ్లి అమ్మాయిండే గది కిటికీ తీసి లోనికి వెళ్లాడు. వీళ్లు చేస్తున్న ఈ పాడుపనికి అమ్మాయి రూమ్ మేట్స్ సహకరించి.. వీరిద్దరూ లోపలుండగా బయట లాక్ వేసుకుని క్యాంపస్ నుంచి బయటకొచ్చేశారు.

సస్పెండ్!
తీరా చూస్తే.. సెక్యూరిటీ కనిపెట్టేసి తాళాల పగలగొట్టి మరీ ఇద్దర్నీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చివరికి ప్రిన్సిపల్ ముందు హాజరుపరిచి.. అనంతరం తల్లిదండ్రులను పిలిచి జరిగిన విషయాన్ని తెలియజేశారు. దీని ఫలితం ఆ ఇద్దరితో పాటు యువకుడికి సహకరించిన ఆరుగురు విద్యార్థినులను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన హాట్ టాపిక్ అయ్యింది.

More News

త‌రుణ్ భాస్క‌ర్ షాక్‌!!

షార్ట్ ఫిలింస్ నుండి `పెళ్ళిచూపులు` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన త‌రుణ్ భాస్క‌ర్ తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని న‌మోదు చేసుకోవ‌డ‌మే కాదు..

సాయి కుమార్ చేతుల మీదుగా కాలేజ్ కుమార్ ట్రైలర్ లాంచ్ !!!

ఎమ్ ఆర్  పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ గౌడా సమర్సణ లో ఎల్ పద్మనాభ నిర్మించిన చిత్రం కాలేజ్ కుమార్. కన్నడ ఘన విజయం సాధించిన ఈ మూవీ ని  తెలుగు లో రిమేక్ చేసాడు

'పలాస 1978' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి .. మార్చ్ 6న విడుదల

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా  ‘‘పలాస 1978’’ .

మ‌హేశ్ సినిమా ఆగిపోయిందా?

ఈ ఏడాది సంక్రాంతికి ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ పెద్ద హిట్ సాధించాడు.

డైరెక్టర్ గా శివ‌కు '22' సినిమా బిగ్ హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నా - ప్ర‌భాస్

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో