ఆర్ఆర్ఆర్ థియేటర్‌లో విషాదం.. సినిమా చూస్తూ గుండెపోటుతో అభిమాని మృతి

  • IndiaGlitz, [Friday,March 25 2022]

టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన చిత్రం ‘‘ఆర్ఆర్ఆర్’’. ఎన్నో అవాంతరాలను దాటుకుని ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో తెలుగు నాట థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, పాలాభిషేకాలతో అభిమానులు సందడి చేస్తున్నారు. అటు స్పెషల్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడ్డారు. అయితే సినిమా రిలీజ్ సందర్భంగా కొన్ని చోట్ల అపశృతులు చోటు చేసుకుంటున్నాయి.

మెగా- నందమూరి అభిమానుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు.. చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి. టికెట్లు సంపాదించే విషయంలోనూ అభిమానులు నువ్వా నేనా అన్నట్టు ప్రవర్తిస్తున్నారు . చిత్తూరు జిల్లాలో టికెట్లు చించేసిన సంఘటనలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే ట్రిపుల్ ఆర్ చూస్తూనే ఓ అభిమాని ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం నగరంలో ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ గుండెపోటుతో ఓ అభిమాని మృతి చెందాడు. శుక్రవారం ఎస్ వీ మ్యాక్స్ థియేటర్లో ఆర్ఆర్ఆర్ సినిమా బెనిఫిట్ షోలు వేయడంతో ఓబులేసు (30) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ప్రీమియర్ షోకి వెళ్లాడు. సినిమా చూస్తున్న సమయంలో ఒక్కసారిగా అతడికి గుండెపోటు వచ్చింది.

దీంతో వెంటనే అప్రమత్తమైన తోటి అభిమానులు అతనిని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఓబులేసు కుటుంబసభ్యులు, సన్నిహితులు విషాదంలో కూరుకుపోయారు.

More News

నేపాల్‌లో భారతీయ పేమెంట్స్ సిస్టమ్.. ప్రారంభమైన ‘యూపీఐ’ సేవలు

నోట్ట రద్దు సమయంలో మనదేశంలో అందుబాటులోకి వచ్చిన యునిఫైట్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే.

మెగా- నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్.. హైదరాబాద్‌లో ఈ ఐదు థియేటర్లలో ‘‘ఆర్ఆర్ఆర్’’ స్పెషల్ షో, ఉ.7కి ముందే

తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ‘‘ఆర్ఆర్ఆర్’’ మరికొద్దిగంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

రెండ్రోజుల్లో ఐపీఎల్ ... ధోనీ సంచలనం , చెన్నై కెప్టెన్‌గా తప్పుకున్న మహీ

ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌‌కి షాక్ తగిలింది. జట్టును పలు మార్లు విజేతగా నిలిపిన మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.

పిల్లి వల్ల అక్షరాలా 100 కోట్ల నష్టం.. లబోదిబోమంటోన్న జనం, ఎక్కడో కాదు ఇండియాలోనే

మియావ్ మియావ్ అనుకుంటూ ఎలుకలు పట్టుకోవడానికి ఇళ్లలోకి దూరి.. సామాన్లన్నీ చిందర వందర చేసే పిల్లి అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.

'గని'లో తమన్నా స్పెషల్ సాంగ్ ... వీడియో వెర్షన్ వచ్చిందోచ్, పిచ్చెక్కిస్కోన్న మిల్కీబ్యూటీ

చేతి నిండా సినిమాలతో, అగ్ర కథానాయికగా బిజీగా వున్న సమయంలోనే ‘ఐటెం సాంగ్’ చేసి సంచలనం సృష్టించారు మిల్కీబ్యూటీ తమన్నా.