భార్యను చంపి అద్భుతమైన స్క్రీన్‌ప్లే నడిపాడు.. కానీ కథ అడ్డం తిరిగింది

  • IndiaGlitz, [Saturday,February 06 2021]

పెళ్లయిన రెండు నెలలకే భార్యను హతమార్చి తన పైకి కేసు రాకుండా పెద్ద స్కెచ్చే వేశాడు. సినిమా రేంజ్‌లో స్క్రీన్‌ప్లే నడిపాడు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. అనూహ్యంగా పోలీసులకు దొరికిపోయి కటకటాలు లెక్కిస్తున్నాడు. అసలు విషయంలోకి వెళితే ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెంకు చెందిన ఎర్రమాల నవ్యారెడ్డి(20) సత్తుపల్లి సమీపంలోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతోంది. కాగా.. డిసెంబర్ 2020లో ఆమె వివాహం.. తన మేన బావ అయిన నాగశేషురెడ్డితో జరిగింది. ఈ క్రమంలోనే ఈ నెల 2న తన భార్యకు జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపిచ్చి కుక్కలగుట్ట శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతుకు చున్నీ బిగించి హత్య చేశాడు.

హత్యానంతరం నవ్యారెడ్డి మొబైల్ నుంచి ఆమె తండ్రికి మంచి స్టోరీ అల్లి మెసేజ్ చేశాడు. తనకు ఇంజినీరింగ్‌లో బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మెసేజ్ పెట్టి ఏమీ ఎరుగనట్టు ఇంటికి వెళ్లిపోయాడు. అనంతరం 3వ తేదీన తన భార్య కనిపించడం లేదని.. క్రితంరోజు సత్తుపల్లి సమీపంలోని కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదని నాగశేషురెడ్డి పెనుబల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఈ క్రమంలో నవ్యారెడ్డి 2వ తేదీన నాగశేషుతో కలిసి బైక్‌పై వెళ్లిన దృశ్యాలు పెనుబల్లి మండలంలోని కుప్పెనగుంట్ల గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు కనిపించాయి.

ఈ క్రమంలోనే పోలీసులకు అనుమానం రావడంతో.. నాగశేషును అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిందితుడు అసలు నిజం కక్కేశాడు. ఈ నెల 2వ తేదీన నవ్యకు జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపిచ్చి కుక్కలగుట్ట శివారులోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లానని.. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చున్నీతో చెట్టుకు ఉరి వేసినట్టు వెల్లడించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పెనుబల్లి ఆసుపత్రికి తరలించారు. కాగా.. నాగశేషుకు వేరే యువతితో ఉన్న ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని నవ్య బంధువులు ఆరోపిస్తున్నారు.

More News

పవన్ టైటిల్ ఫిక్స్.. ఇక అధికారిక ప్రకటనే తరువాయి..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లోగా వీలైనన్ని సినిమాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

థియేటర్స్‌ యాజమాన్యాలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

థియేటర్స్‌ యాజమాన్యాలకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ లాక్ డౌన్ రూల్స్ సడలింపుల్లో భాగంగా ఈ నెల ఒకటో తేదీ

రాజ‘శేఖర్’ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

చాలా కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన హీరో రాజశేఖర్ 2017లో ఎంట్రీ ఇచ్చి ‘గరుడవేగ, కల్కి’ వంటి సినిమాలతో మరోమారు తన స్టామినాను రుజువు చేసిన విషయం తెలిసిందే.

స్టార్ మా లో ఈ ఆదివారం.. విందు భోజనం

స్టార్ మా లో ఈ ఆదివారం.. అంటే ఫిబ్రవరి 7న .. మరింత స్పెషల్ గా ఉండబోతోంది . అభిమాన సెలెబ్రిటీలు అందరూ ప్రేక్షకులను అలరించేందుకు

ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్‌.... ప్రాక్టీస్‌లో రామ్ & భీమ్‌!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్‌ షూటింగ్‌ కొన్ని రోజుల క్రితం స్టార్ట్‌ అయింది.