సూపర్‌స్టార్ రజనీ మోషన్ పోస్టర్ అదుర్స్...

‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొన్న విషయం తెలిసిందే. త్వరలో ఈ కార్యక్రమం డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌‌ను తాజాగా రిలీజ్ చేసింది. 15 సెకన్ల మోషన్ వీడియోను బేర్‌గిల్స్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం అది నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాను ఇప్పటివరకూ ఎంతో మంది స్టార్స్‌తో పని చేశానని.. కానీ ఇది మాత్రం తనకు ఎంతో ప్రత్యేకమని..‘లవ్ ఇండియా’ అంటూ ట్వీట్ చేశాడు. రజినీకాంత్ గొప్ప స్టార్ అని.. అలాంటి వ్యక్తితో సమయం గడపడం.. అలాగే సరికొత్త రజినీ గురించి తెలుసుకోవడం.. చూడటం చాలా హ్యాపీగా ఉందని గిల్స్ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌ను రజనీ వీరాభిమానులు పెద్ద ఎత్తున లైక్ చేస్తూ షేర్ల వర్షం కురిపిస్తున్నారు.