మన ఊరి రామాయణం సస్పెన్స్ టీజర్ రిలీజ్..!

  • IndiaGlitz, [Wednesday,September 07 2016]

జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ రూపొందించిన‌ ద్విభాషా చిత్రం మన ఊరి రామాయణం. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృథ్వి, రఘుబాబు ప్రధాన పాత్ర‌లు పోషించారు.ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌లో ఇదొల్లె రామాయణ అనే టైటిల్ తో రిలీజ్ చేయ‌నున్నారు. ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 7న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మ‌న ఊరి రామాయ‌ణం టీజ‌ర్ రిలీజ్ చేసారు.
సమాజంలో ఎంతో గౌరవించబడే ఆ వ్యక్తి జీవితంలో శ్రీరామనవమి సమయంలో లో జరిగినటువంటి ఒక సంఘటన తన జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పింది అనేది ప్రధానంశంగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రతి మ‌నిషిలో ఒక రాముడు ఒక రావణుడు వుంటాడు అని తెలియ‌చెప్పే చిత్రం ఇది. టీజ‌ర్ చూస్తుంటే...స‌స్పెన్స్ తో ఉండేలా ఈ చిత్రాన్ని రూపొందించిన‌ట్టు తెలుస్తుంది. శ్రీరామ‌న‌వ‌మి రోజు ఏం జ‌రిగింది. ఆ వ్య‌క్తి జీవితాన్ని ఎలా మ‌లుపు తిప్పింది అనేది తెలియాలంటే మ‌న ఊరి రామాయ‌ణం చూడాల్సిందే. మ‌రి...ప్ర‌కాష్ రాజ్ అభిరుచికి త‌గ్గ‌ట్టుగా వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన మ‌న ఊరి రామాయ‌ణం అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుందో లేదో చూడాలి..!

More News

క్రిస్మస్ రేసులో నాని...

నేచురల్ స్టార్ నాని హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందనున్న చిత్రం

పూరితో ఎన్టీఆర్‌

టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో ఇప్పుడు జ‌న‌తాగ్యారేజ్ చిత్రాల‌తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఏంట‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

ఆ డైరెక్ట‌ర్ తో చ‌ర‌ణ్ మ‌ళ్లీ సినిమా చేస్తున్నాడా..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న ధృవ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం త‌ర్వాత చ‌ర‌ణ్ సుకుమార్ తో సినిమా చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అది ఇంకొక్క‌డు తో నెర‌వేరింది - విక్ర‌మ్

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు,  ఐ...ఇలా విభిన్నమైన చిత్రాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించిన విక్ర‌మ్ న‌టించిన తాజా చిత్రం ఇంకొక్క‌డు. ఈ చిత్రంలో విక్ర‌మ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌, నిత్యామీన‌న్ న‌టించారు.

నందమూరి కళ్యాణ్‌రామ్‌, పూరి జగన్నాథ్‌ల ఇజం టీజర్‌కు 1 మిలియన్‌ వ్యూస్‌

డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ - డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్నపవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇజం. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యాన‌ర్ పై  నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈనెల‌ 5న పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు.