'వైఫ్ ఆఫ్ రామ్' గా మంచు లక్ష్మి

  • IndiaGlitz, [Tuesday,January 16 2018]

కంటెంట్ ఉన్న సినిమాలతో అలరించే నటి మంచు లక్ష్మి. తండ్రికి తగ్గ తనయగా, బెస్ట్ యాక్ట్రెస్ గా ప్రూవ్ చేసుకున్న మంచు లక్ష్మి మరోసారి ఓ సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతోంది. చాలా రోజులు క్రితమే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ టైటిల్ ను సంక్రాంతి సందర్భంగా ప్రకటించారు. 'వైఫ్ ఆఫ్ రామ్' ఈ చిత్రం పేరు. కథకు ఖచ్చితంగా సరిపోతుందని భావించి ఈ టైటిల్ నిర్ణయించారు.

టైటిల్ చాలా బావుందని చిత్ర యూనిట్ తో పాటు చాలామంది నుంచి మంచి అప్రిసియేషన్ వస్తోంది. 'వైఫ్ ఆఫ్ రామ్' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఇందులో మంచు లక్ష్మి పాత్ర చాలా భిన్నంగా సాగుతుంది. అబద్ధాలను నిజమని నమ్మే పాత్రలో మంచు లక్ష్మి కనిపిస్తుంది. ఈ పాత్రలో ఆమె నటన చాలా సహజంగా, అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు.

పూర్తి వైవిధ్యంగా మానవ సంబంధాలు, భావోద్వేగాల చుట్టూ తిరిగే కథ ఇది. రాజమౌళి వద్ద 'ఈగ', 'బాహుబలి-1' చిత్రాలకు అసిస్టెంట్ గా పనిచేసిన విజయ్ యలకంటి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. కృతి ప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

More News

'మిఠాయి' ప్రారంభం

డార్క్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న కొత్త చిత్రం 'మిఠాయి'.

'కృష్ణార్జునయుద్ధం' లో కృష్ణ లుక్

నేచరల్ స్టార్ నాని...సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఈ యువ కథానాయకుడు విలక్షణమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను, అభిమానులను ఎంటర్ టైన్ చేస్తున్నారు.

రెగ్యులర్ షూటింగ్ లో అనగనగా ఓ రాజకుమారుడు

నవీన్ బాబు, సంజన, అమృత హీరో హీరోయిన్లు గా శ్రీమతి రమాదేవి సమర్పణలో

జనవరి 25న మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా నాగశౌర్య ఛలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

'ఊహలు గుసగుసలాడే','దిక్కులు చూడకు రామయ్య','లక్ష్మిరావే మా ఇంటికి”,'కళ్యాణవైభోగం

'MLA' మార్చ్ లో విడుదల

నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా,నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం లో రూపొందుతోన్న ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ 'MLA'.