ఇన్‌స‌ల్ట్ చెయ్యొద్దంటున్న హీరో

  • IndiaGlitz, [Saturday,January 05 2019]

హీరో మంచు మ‌నోజ్ ఇప్పుడు సినిమాల‌కు కాస్త బ్రేక్ తీసుకున్నాడు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ స‌మ‌జానికి సంబంధించిన విష‌యాల్లో భాగ‌మ‌య్యేలా ప‌నులు చేస్తున్నారు. ఇటీవ‌ల ఓ పేషంట్‌కు ర‌క్తం కావాల‌ని మ‌నోజ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గానే నెటిజ‌న్స్ స‌కాలంలో స్పందించి ర‌క్తం అందేలా చేశారు. పెషంట్ బ్ర‌తికారు.

దీంతో పెషంట్ బంధువు ఒక‌రు 'థాంక్స్ అన్నా..నీ వ‌ల్ల ఒక కుటుంబం ఆనందంగాఉంది. నువ్వు మెసేజ్ పోస్ట్ చేయ‌డం వ‌ల్లే అంత మంది ర‌క్తం అందించడానికి ముందుకు వ‌చ్చారు' అని ట్వీట్ చేశారు. దానికి ప్ర‌తిగా మ‌నోజ్ 'ద‌య‌చేసి థాంక్స్ చెప్పి న‌న్ను ఇన్‌సల్ట్ చెయ్యొద్దు త‌మ్ముడు. ఈ ప్ర‌పంచంలో మ‌నుషులంతా క‌లిసి ఉండాలి. ఒక‌రి ఒక‌రు తోడుగా ఉండాలి. ల‌వ్ యు ఆల్‌' అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేశారు.

More News

మ‌హేష్‌తో క‌త్రినా...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఇప్పుడు త‌న 25వ చిత్రం `మ‌హ‌ర్షి`తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నెల‌తో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది.

ఆర్.ఆర్.ఆర్ కోసం ఇంకా మొద‌లెట్ట‌లేద‌ట‌...

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్‌.ఆర్‌.ఆర్‌`(వ‌ర్కింగ్ టైటిల్‌..త్వ‌ర‌లోనే టైటిల్‌ను అనౌన్స్ చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి).

సింగిల్ టేక్‌లో యాక్ష‌న్ షెడ్యూల్‌

రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న చిత్రం `క‌ల్కి`. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది.

చెర్రీకి సీక్రెట్ అకౌంట్ ఉందా ?

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్‌కి సంబంధించిన సీక్రెట్‌ను ఆయ‌న కోస్టోర్, హీరోయిన్ కియ‌రా అద్వాని బ‌య‌ట పెట్టింది.

'ఎఫ్ 2' సెన్సార్ పూర్తి ...సంక్రాంతి విడుద‌ల‌

ఈ సంక్రాంతి పండుగ‌కు అల్లుళ్ల‌మంటూ విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతున్నారు.