ల‌క్ష్మి బాంబ్ కోసం మంచు మ‌నోజ్ ఫైట్స్

  • IndiaGlitz, [Saturday,August 13 2016]

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీ నరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్‌. మూడు రోజుల మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ ను మంచు మ‌నోజ్ డిజైన్ చేయ‌డం విశేషం. ఈ సంద‌ర్బంగా....

మంచు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ''చాలెంజింగ్‌ పాత్ర చేస్తున్నాను. సినిమా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఇప్పటి వరకు చేయని డిఫరెంట్‌ క్యారెక్టర్‌. సింగిల్ షెడ్యూల్‌లో ఏక‌ధాటిగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం. మూడు రోజులు మాత్ర‌మే షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఫైట్స్‌, సాంగ్స్‌ బాగా వచ్చాయి.ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్‌ను తమ్ముడు మ‌నోజ్ కంపోజ్ చేశాడు. చాలా బాగా వ‌చ్చింది. డైరెక్టర్‌ కార్తికేయ గోపాలకృష్ణగారు సినిమాను బాగా తెరకెక్కిస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను దీపావళి ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం'' అన్నారు.

చిత్ర సమర్పకుడు గునపాటి సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ ''మంచి టీం కుదిరింది. సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో పూర్తి చేస్తున్నాం. మూడు రోజులు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. మంచులక్ష్మీగారి, ఇతర నటీనటులు, టెక్నిషియన్స్‌ బాగా సపోర్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్‌ను మ‌నోజ్‌గారు డిజైన్ చేయ‌డం ఆనందంగా ఉంది. అందుకు ఆయ‌న‌కు నా స్పెష‌ల్ థాంక్స్‌. సినిమాను దీపావళి ముందే రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ ''అడ‌గ్గానే మ‌నోజ్ గారు కాద‌న‌కుండా ఫైట్‌ను డిజైన్ చేయ‌డానికి ఒప్పుకున్నందుకు ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన కృతజ్ఞ‌త‌లు. సినిమా చాలా బాగా వ‌స్తుంది. కామెడి, ఎంటర్‌టైన్‌మెంట్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఉన్నాయి. ఆగస్ట్‌ 15కు పూర్తవుతుంది. త్వరలోనే ఆడియో ప్లాన్‌ చేస్తున్నాం. దీపావళికి ముందే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

More News

'జ‌న‌తాగ్యారేజ్'ఆల‌స్యం అవుతుందా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్ రూపొందుతోన్న చిత్రం ‘జ‌న‌తాగ్యారేజ్’. సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలు త‌ర్వాత ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న మూడో చిత్ర‌మిది.

డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల్లో గోపీచంద్ 'ఆక్సిజన్'

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

నీజ‌త‌లేక ప్ర‌మోష‌న‌ల్ టైటిల్ సాంగ్ రిలీజ్

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా పారుల్‌, సరయు హీరోయిన్స్‌గా శ్రీ సత్య విదుర మూవీస్‌ పతాకంపై లారెన్స్‌ దాసరి దర్శకత్వంలో జి.వి.చౌదరి, నాగరాజ్‌ గౌడ్‌ చిర్రా నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'నీ జతలేక'. కరుణాకర్‌ కంపోజ్‌ చేసిన ఈ సినిమా ప్రమోషనల్‌ టైటిల్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ శనివారం హైదరాబాద్‌ రేడియో సిటీలో విడుదల చేశారు.

చిన్నారి అభిమానిని చూసి చ‌లించిన రామ్‌

రామ్ అనే పేరు విన‌గానే అంద‌రికీ అంద‌మైన కుర్రాడి రూపం క‌ళ్ల‌ముందు క‌దులుతుంది. అంత‌క‌న్నా హుషారుగా ఉండే వ్య‌క్తిత్వం గుర్తుకొస్తుంది. కానీ శుక్రవారం విశాఖ వాసుల‌కు మాత్రం అత‌నిలోని మంచి మ‌న‌సు క‌నిపించింది. చిన్నారి బాధ‌ను చూసి చ‌లించిపోయి కంటికింద చెమ్మై చేరిన అత‌ని ఉదార‌త క‌ళ్ల‌ముందు సాక్షాత్కార‌మైంది. వివ‌రాల్లోకెళ&

బ‌న్ని స్టార్ హీరో కాదా..?

తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ అలియాస్ బ‌న్ని మెగా క్యాంప్ హీరో అయినా త‌న‌దైన క‌ష్టంతో ఓ క్రెడిబిలిటీ, ఇమేజ్ సంపాదించుకున్నాడు. అందుకు నిద‌ర్శనం స‌రైనోడు. మిక్స్‌డ్ టాక్ తో స్టార్ అయిన ఈ సినిమా వంద‌కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ సాధించి బాక్సాఫీస్ వ‌ద్ద బ‌న్ని రేసుగుర్రం అని ప్రూవ్ చేసింది.