నెటిజన్ల మండిపాటు.. మనోజ్ సంచలన ప్రకటన

  • IndiaGlitz, [Tuesday,March 26 2019]

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుకు సంబంధించిన విద్యానికేతన్‌ విద్యాసంస్థల ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం తమ కాలేజీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ ఇటీవల కాలేజీ విద్యార్థులతో మోహన్‌ బాబు ధర్నాకు దిగారు. నాటి నుంచి తెలుగు తమ్ముళ్లు.. మంచు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక విషయానికొస్తే.. ఓ టీడీపీ కార్యకర్త చేసిన ఆరోపణలపై మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ కామెంట్ కాస్త కఠినంగానే ఆయన స్పందించారు. అయితే మనోజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాస్పదమవ్వడంతో పలువురు నెటిజన్లు కన్నెర్రజేశారు. ఈ నేపథ్యంలో మనోజ్ ఓ ప్రకటనను విడుదల చేశారు.

మనోజ్ మాటల్లోనే...

‘అందరికీ ఓ చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఎప్పుడూ పార్టీలకు అతీతంగా ప్రజల కోసం నిలబడాలనుకునే మనిషిని. ఒక మనిషికి సాయం చేసేటప్పుడు తన కష్టం తప్ప కులం, మతం చూడకూడదని పూర్తిగా నమ్మే మనిషిని. ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ కోసం చేసిన దీక్షకి మద్దతుగా నేను నిలబడింది పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్న ఉద్దేశంతోనే. ఎటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం కాదని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను.

నేను చంద్రబాబు గారి పార్టీ మనిషిపైన కఠినంగా స్పందించింది కేవలం ఆయన మా కాలేజీపై మోపిన తప్పుడు ఆరోపణల వల్ల తప్ప వేరే ఉద్దేశంతో కాదు. అది మా నాన్నగారు కష్టార్జితంతో ఎన్నో ఒడిదుడికులను ఎదుర్కొని కాలేజీ. ఆ రోజు రోడ్డు మీద మా నాన్నతో నడిచింది.. ఒక పెద్ద మనిషిపై తీవ్రంగా స్పందించింది కేవలం మా పిల్లలకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో మాత్రమే.

ఈ మంచు మనోజ్, రాజకీయ పార్టీలకి అతీతంగా ప్రజాసేవకి ఎప్పుడూ ముందుంటాడని, పదిమందికి మంచి చేసే కార్యక్రమం ఎప్పుడూ ఏ పార్టీ తలపెట్టినా దానికి తాను మద్దతుగా నిలబడతాడని, అలాగే ప్రజలకు అన్యాయం చేసే ఏ పార్టీనైనా నిలదీస్తాడని సవినయంగా మనవి చేసుకుంటున్నాను అని మనోజ్ ప్రకటనలో పేర్కొన్నారు.

More News

వైసీపీలోకి మోహన్ బాబు.. జగన్ గెలుపు తథ్యం

టాలీవుడ్ సీనియర్ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్ మంచు మోహన్ బాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం ఉదయం లోటస్‌పాండ్‌‌కు వెళ్లిన మోహన్ బాబు, మంచు విష్ణు..

కోన వెంకట్‌ పొలిటికల్ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవుతారు!

టాలీవుడ్ ప్రముఖ రచయిత కోన వెంకట్ ఇటీవల సాక్షి పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఆ ఇంటర్వ్యూలో తాను చెప్పిన కొన్ని విషయాలను ప్రచురించలేదని ఆయన చెబుతున్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన..

దెబ్బ కొడితే పడటానికి ఇదేం 2009 కాదు 2019..

భీమ‌వ‌రం, గాజువాక శాస‌న‌స‌భ స్థానాల నుంచి త‌న‌ను ఓడించ‌డానికి బీజేపీ, టీడీపీ, వైసీపీ పార్టీలు కుట్ర‌లు చేస్తున్నాయ‌ని,  ఆకుట్ర‌ల‌ను తుత్తునీయ‌లు చేసి భారీ మెజార్టీతో విజ‌యం

జనసేన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పూర్తి జాబితా

జ‌న‌సేన పార్టీ తరఫున ఆంధ్ర‌ప్రదేశ్ శాస‌న‌స‌భకు పోటీ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్ధుల పూర్తి జాబితాను విడుదల చేసింది. పలు విడతల్లో అభ్యర్థులను ప్రకటిన సంగతి తెలిసిందే.

'అవెంజ‌ర్స్‌' కోసం రెహ‌మాన్ ఏం చేస్తున్నాడో తెలుసా?

మార్వెల్ స్టూడియోస్ నిర్మాణంలో మార్వెల్ కామిక్స్  ఆధారంగా రూపొందిస్తున్న అవెంజెర్స్ సిరీస్‌లో 'అవెంజెర్స్ ఎండ్ ది గేమ్' చిత్రం ఏప్రిల్ 26న విడుద‌ల కాబోతుంది.