'గుంటూరోడు' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తాను - మంచు మనోజ్

  • IndiaGlitz, [Sunday,February 26 2017]

మంచు మనోజ్‌, ప్రగ్యా జైశ్వాల్‌ హీరో హీరోయిన్లుగా క్లాప్స్‌ అండ్‌ విజిల్స్‌ బ్యానర్‌లో ఎస్‌.కె.సత్య దర్శకత్వంలో వరుణ్‌ నిర్మించిన చిత్రం 'గుంటూరోడు'. ఈ సినిమా మార్చి 3న విడుదలకు సిద్ధమైంది. ఈ సంద‌ర్భంగా మంచు మ‌నోజ్‌తో ఇంట‌ర్వ్యూ...
సినిమాలో క్యారెక్ట‌ర్ గురించి...
- ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నాం. కానీ మాకు అనుకున్న‌న్ని థియేట‌ర్లు దొర‌క‌లేదు. దేవుడు ద‌య‌వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌లో విడుద‌లైన సినిమాల‌న్నీ హిట్ అవుతున్నాయి. అందువ‌ల్ల థియేట‌ర్లు దొర‌క‌లేదు. మార్చి 3న థియేట‌ర్స్‌లో విడుద‌ల కానుంది.ఇది కంప్లీట్‌గా హీరోయిజ‌మ్ ఉన్న సినిమా. సింపుల్ థ్రెడ్‌. అయినా స‌త్య సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు. సినిమా మంచి యాక్ష‌న్ టెంపోలో ఉంటుంది. క్యారెక్ట‌ర్ గురించి చెప్పాలంటే గుంటూరోడు ఎక్కువ ఆనందం వ‌చ్చినా త‌ట్టుకోలేడు. కోపం వ‌చ్చినా త‌ట్టుకోలేడు. క‌ళ్ల ముందు అన్యాయం జ‌రిగితే వాడి చేతికి దుర‌ద పుడుతుంది. దుర‌ద ఎలా తీరుతుందో సినిమా చూస్తే తెలుస్తుంది. దుర‌ద తెచ్చిన ఇబ్బందుల‌తో ఈ సినిమా జ‌రుగుతుంది. ఆనందం వ‌చ్చినా స్పెష‌ల్ థీమ్ సాంగ్ వేసుకుని ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తుంటాడు. సినిమా మొత్తం ఆ థీమ్ సాంగ్ ఉంటుంది.
ఆల‌స్యానికి కార‌ణం...
- నిజానికి ముందుగా ఫిబ్రవరి 24న విడుదలచేద్దామని అనుకున్నాం. కానీ అప్పటికే అన్ని థియేటర్లలో మంచి సినిమాలు ఉండటం వలన మా సినిమాకి అనుకున్నవ‌న్నీ ఎక్కువ థియేటర్లు దొరకలేదు. అందుకే కాస్త ఆగి థియేటర్లు చూసుకుని మార్చి 3న రిలీజ్ చేస్తున్నాం.
ప్ర‌యోగాలు చేస్తాను...
- నేను స్టార్టింగ్ నుండి డిఫ‌రెంట్ సినిమాల‌ను చేస్తూ వ‌స్తున్నాను. భ‌విష్య‌త్‌లో కూడా ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేస్తాను. ఇప్ప‌టి వ‌ర‌కు నేను ఫుల్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ చేయ‌లేదు. అందుక‌నే 'గుంటూరోడు' సినిమా చేశాను. ఈ సినిమా తరువాత నేను చేసే సినిమాలు ప్రయోగాత్మకంగానే ఉంటాయి. నేను చేసిన సినిమాల్లో ప్రయాణం, వేదం, నేను మీకు తెలుసా' సినిమాల‌ను ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్‌గానే అనిపిస్తాయి. లే. అవి ఇపుడు చూసిన ఫ్రెష్ గానే ఉంటాయి
ద‌ర్శ‌కుడు స‌త్యతో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌...
- ద‌ర్శ‌కుడు సత్య న‌న్ను క‌లిసిన‌ప్పుడు అత‌ను ముందు ఏ సినిమా చేశాడో కూడా తెలియ‌దు. కానీ త‌ను నెరేష‌న్ న‌చ్చే సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాను. ఒక హిట్‌, ప్లాప్‌ను బేస్ చేసుక‌ని ద‌ర్శ‌కుడి టాలెంట్‌ను లెక్క వేయం. చెప్పింది చెప్పినట్టే తీశాడు. అతను నాకు చేసి చూపిన యాక్షన్ నే ఫాలో అయిపోయాను. సినిమా చివర్లో ఎమోషనల్ సన్నివేశాలను చాలా బాగా తీశాడు. ఖచ్చితంగా ఇది మంచి హిట్టవుతుంది.
బ‌రువు పెర‌గ‌డం, త‌గ్గ‌డం గురించి...
- గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు సినిమాలకి నాలో 8 కేజీల బరువు తేడా ఉంటుంది. ఈ బరువును కేవలం 20 రోజుల్లో తగ్గించా. బరువు పెరగడం సులభమే కానీ తగ్గటమే కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా ఒకసారి అలవాటైతే పర్లేదు చేసేయ్యొచ్చు.
ప్ర‌భాక‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను...
- అజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న ఒక్క‌డు మిగిలాడు సినిమా మంచి యాక్ష‌న్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. 1990, 2017 లో నడిచే రెండు కథలు ఉంటాయి. సినిమాలో ఎల్‌.టి.టి.ఇ ప్ర‌భాక‌ర‌న్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. ఈ సినిమా మే నెలలో రిలీజవుతుంది. శ్రీలంకలోని తమిళులపై జరిగే అన్యాయాలను చూసి ప్రభాకరన్ ఒక నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేదే చూపిస్తాం.
త‌మిళంలో కూడా...
మే నెల‌లో నా ద్విభాషా చిత్రం స్టార్ట‌వుతుంది. అలాగే గుంటూరోడు సినిమాను కూడా త‌మిళంలో రీమేక్ చేద్దామ‌నుకుంటున్నాను.
చాలా ఘోరం...
- న‌టి భావన‌పై జ‌రిగిన దాడి చాలా ఘోరం. ప్ర‌స్తుతం సొసైటీలో ఆడవాళ్లు, చిన్న పిల్లలపై చాలా ఘోరాలు జరుగుతున్నాయి. అవి చూస్తుంటే కోపమొస్తుంటుంది. త‌ప్పు చేసిన వారినేదైనా చేసేయాల‌నిపిస్తుంటుంది. ఈ అంశంపై నా నెక్ట్స్ మూవీ ఉంటుంది. అలాగే చిన్నాగారు ఎక్స్‌ట్రార్డిన‌రీ రీ రికార్డింగ్ ఇచ్చారు. రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాత మీరంద‌రూ రీరికార్డింగ్ గురించే మాట్లాడుకుంటారు.
టీం గురించి...
- కోట శ్రీనివాస‌రావుగారు త‌ప్ప ఈ సినిమాకు ప‌నిచేసిన వారంద‌రూ యంగ్ టీం. సినిమాటోగ్రాఫ‌ర్ సిద్ధార్థ్‌, డిజె.వ‌సంత్‌, ఇలా అంద‌రూ పోటీ ప‌డి సినిమా చేశాం. అందుకే సెట్‌లో ఎప్పుడూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండేది. చిన్నా రీరికార్డింగ్, వసంత్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. అవి బాగా హైలైట్ అవుతాయి.

More News

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు ఆదివారం హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో జరిగాయి.

బన్నితో సినిమా చేస్తున్నాను: లింగుస్వామి

పందెంకోడి సినిమాతో తెలుగు,తమిళంలో పెద్ద హిట్ కొట్టిన దర్శకుడు ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో

తెలుగు సినీ పరిశ్రమ మంచి నిర్మాతనే కాదు, మంచి వ్యక్తిని కోల్పోయింది: బాలకృష్ణ

'ప్రముఖ సినీ నిర్మాత కె.సి.శేఖర్ బాబు కన్నుమూయడం చాలా బాధాకరం.

పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లో సపోర్ట్ చేస్తాః నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు రాజకీయాల పరంగా తన సపోర్ట్ తన తమ్ముడికే ఉంటుందని చెప్పేశాడు.

దుబాయ్ వెళుతున్న జగన్నాథమ్...

ఆర్య,పరుగు సినిమాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్,నిర్మాత దిల్రాజు కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం'డిజె దువ్వాడ జగన్నాథమ్'.