close
Choose your channels

వ‌రుస సినిమాలు ప్లాన్ చేస్తున్న మంచు విష్ణు

Friday, May 15, 2020 • తెలుగు Comments

వ‌రుస సినిమాలు ప్లాన్ చేస్తున్న మంచు విష్ణు

మంచు మోహ‌న్‌బాబు త‌న‌యుడైన మంచు విష్ణు ఆచార్య అమెరికా యాత్ర త‌ర్వాత ఏడాదికిపైగానే సినిమా చేయ‌లేదు. గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఏకంగా నాలుగు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు. అందులో రెండు సినిమాల్లో త‌ను హీరోగా న‌టిస్తూ నిర్మించ‌డ‌మే కాకుండా ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని చ‌ద‌రంగం వెబ్ సిరీస్‌ను విడుద‌ల చేశాడు. ఇది కాకుండా మ‌రో హీరోతో మ‌రో సినిమాను నిర్మిస్తున్నాడు. ఇవ‌న్నీ కాకుండా మ‌రో నాలుగు సినిమాల‌ను మంచు విష్ణు ప్లాన్ చేశాడ‌ట‌.

వివ‌రాల్లోకెళ్లే.. ప‌రిమిత‌మైన బ‌డ్జెట్‌లో మంచు విష్ణు సినిమాను నిర్మించాల‌నుకుంటున్నాడ‌ట‌. బ‌డ్జెట్ ఎంత ప‌రిమితంగా ఉండాలనే ఆలోచ‌నలో ఉన్నాడంటే ఆ సినిమాల‌ను ఓటీటీలో విడుద‌ల చేసినా కూడా త‌న పెట్టుబ‌డి త‌న‌కు వ‌స్తే చాలని అనుకుంటున్నాడ‌ట విష్ణు. ఈ నాలుగు సినిమాల్లో ఓ సినిమాలో ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. అలాగే మిగిలిన మూడు సినిమాల్లో కొత్త హీరో హీరోయిన్స్ న‌టించ‌బోతున్నార‌ని అంటున్నారు. క‌రోనా ఎఫెక్ట్ త‌ర్వాత ఈ సినిమాల‌కు సంబంధించిన అధికారిక స‌మ‌చారం వెలువ‌డుతుంద‌ని అంటున్నారు. హీరోగానే కాకుండా ఇప్పుడున్న ఓటీటీ క్రేజ్‌ను బేస్ చేసుకుని మంచు విష్ణు మూవీ ప్రొడ‌క్ష‌న్‌పై ఫోక‌స్ పెడుతున్నాడు.

Get Breaking News Alerts From IndiaGlitz